130 ‌కోట్ల మంది భారతీయులు నా కుటుంబం

  • వారే నా జీవిత సర్వసం..ఈ జీవితం వారి కోసమే
  • ‘న్యూ ఇండియా’ నిర్మాణానికి కృషి
  • ‘గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌యోజనా సమ్మేళన్‌’‌లో ప్రధాని మోడీ
  • రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ 11‌వ వాయిదా జమ

హైదరాబాద్‌, ‌పిఐబి, మే 31 :  దేశంలో ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం, గౌరవం కోసం, భద్రత కోసం, వారి సమృద్ధి కోసం, సంతోషకరమైన జీవనం కోసం, శాంతి కోసం.. తాను చేయగలిగినదంతా చేస్తానని ధ్రాన మంత్రి నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం..అనేవి ప్రజల దృష్టిలో ప్రభుత్వం అర్థాన్ని మార్చివేశాయని ఆయన అన్నారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌లోని షిమ్లాలో ‘గరీబ్‌ ‌కళ్యాణ్‌ ‌సమ్మేళన్‌’ ‌ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ..  ఇంతకు ముందు శాశ్వతం అని భావించిన సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారమార్గాన్ని చూపించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన మొదటి రోజు నుంచి పేదలకు సాధికారితను కల్పించడానికి ప్రయత్నించిందని అన్నారు.

తాము వోటు బ్యాంకు కోసం కాకుండా సేవా దృక్పథంతో చేస్తున్నామని అన్నారు. 100 శాతం సాధికారిత అంటే, అది భేద భావాన్ని, తృప్తి పరచే ధోరణిని అంతంచేయడమే అర్థమని, 100 శాతం ప్రతి పేద వ్యక్తి ప్రభుత్వ పథకాల తాలూకు పూర్తి ప్రయోజనాలను అందుకోవడమే అర్థమని వివరించారు. 2014లో తాము అధికారంలోకి రాకంటే ముందు అవినీతిని వ్యవస్థలోని ఒక ముఖ్య భాగంగా అప్పటి ప్రభుత్వం భావించిందని, అప్పట్లో అవినీతిపై పోరాడే బదులు దానికి ప్రభుత్వం లొంగిపోయిందని అన్నారు. ఆ కాలంలో పథకాల కోసం ఉద్దేశించిన డబ్బు ఆపన్నులకు చేరే కంటే ముందే లూటీకి గురి కావడాన్ని అప్పటి ప్రభుత్వం చూస్తూ ఉండిపోయిందని ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం జన్‌ ‌ధన్‌-ఆధార్‌-‌మొబైల్‌ (‌జెఎఎమ్‌) ‌మూడింటి కారణంగా లబ్ధిదారులకు చెందిన డబ్బు బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ అవుతుందని వివరించారు. ఇదివరకు వంటింట్లో మహిళలు పొగ పీల్చుతూ ఇబ్బంది పడవలసిన అగత్యం ఉండేదని, కానీ నేడు ఉజ్జ్వల పథకం ద్వారా ఎల్‌ ‌పిజి సిలిండర్‌ల పంపిణీ ద్వారా ఆ దురవస్థ తప్పిందని ప్రధాని అన్నారు.

ఇంతకు మునుపు ఆరుబయలు ప్రాంతాలలో మల మూత్ర విసర్జన చేస్తూ సిగ్గుపడాలి స్థితి ఉండేదని, ప్రస్తుతం పేదలు టాయిలెట్‌ల సదుపాయానికి నోచుకొని గౌరవాన్ని పొందారన్నారు. ఇంతకు ముందు చికిత్స కోసం డబ్బు అప్పు చేసేందుకు నిస్సహాయ స్థితిని ఎదుర్కునాల్సిన దురవస్థ నుంచి ప్రస్తుతం ప్రతి పేదవాడికి ఆయుష్మాన్‌ ‌భారత్‌ అం‌డదండలు లభిస్తున్నాయన్నారు. ఇంత క్రితం ముస్లిం మహిళలకు మూడుసార్లు తలాక్‌ ‌తాలూకు భయం పీడించేదని, కానీ ప్రస్తుతం ఒకరి హక్కుల కోసం పోరాడే ధైర్యం వారికి చిక్కిందని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి గుర్తుగా ఈ వినూత్నమైన సార్వజనిక కార్యక్రమాన్ని దేశం అంతటా, రాష్ట్రాల రాజధానులలో, జిల్లా ముఖ్య పట్టణాలలో మరియు కృషి విజ్ఞాన కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం వారితో నేరుగా భేటీ కావాలనేదే ఈ సమ్మేళన ఉద్దేశ్యం.

ఈసందర్భంగానే  ప్రధాన మంత్రి కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి (పిఎమ్‌-‌కిసాన్‌) ‌పథకంలో భాగంగా 11వ కిస్తీని కూడా విడుదల చేశారు. దీంతో 10 కోట్ల మందికి పైగా రైతు కుటుంబాలకు దాదాపుగా 21,000 కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్లలోకి జమ కానుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి దేశవ్యాప్తంగా గల పిఎమ్‌-‌కిసాన్‌ ‌లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌గవర్నర్‌ ‌రాజేన్ద్ర అర్లేకర్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జయ్‌ ‌రామ్‌ ‌ఠాకుర్‌, ‌పాటు కేంద్ర మంత్రి అనురాగ్‌ ‌సింహ్‌ ‌ఠాకుర్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page