– సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహణ
– పోలీసుల అనుమతి నిరాకరణతో హైకోర్టు అనుమతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: బీఆ ర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వ హించ తలపెట్టిన ‘బీఆర్ఎస్ యువ సంగ్రా మ సభ’కు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. శనివారం హైదరాబాద్ లోని సరూర్నగర్ స్టేడియంలో సభ నిర్వహించు కోవచ్చని తెలిపింది. ఈ మేరకు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చింది. సభరోజు హైవేను బ్లాక్ చేయొద్దని విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలి గించొద్దని పేర్కొంది. పోలీసుల సూచనలు పాటించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్ర యువతకు అనేక హాలు ఇచ్చారని బీఆర్ఎస్ యువజన విభా గం నేతలు చెబుతున్నారు. ఆ సమయంలో సరూర్ నగర్ స్టేడియం నుంచే వారు యూత్ డిక్లరేషన్ ప్రకటించారని వెల్లడిస్తు న్నారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో వా గ్దానాలను యువతకు ఇచ్చారని అంటు న్నారు. నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వారిని మోసం చేస్తోంద ని ఆరోపిస్తున్నారు. యువతకు ఇచ్చిన హాలను కాంగ్రెస్ ఇప్పటివరకు అమలు చే యలేదని బీఆర్ఎస్ యువజన విభాగం నేతలు పేర్కొంటున్నారు. ఈ మేరకు బీఆ ర్ఎస్ యువ సంగ్రామ సభ ద్వారా కాం గ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గులాబీ నేతలు నిర్ణయించారు. అయితే, ఈ సభకు పోలీసులు అను మతి నిరాకరించారు. దీంతో తెలంగాణ హైకోర్టును బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించగా.. తాజాగా వారి సభకు న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు శనివారం నిర్వహించే సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు, యువత పెద్దఎత్తున తరలిరావాలని గులాబీ నేతలు పిలుపునిచ్చారు. కాగా, ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





