– సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ లేఖ
దిల్లీ, జూలై 17: విద్యా సంస్కరణల కో సం ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శుక్ర వారంతో 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలనుద్దేశించి ఒక భావోద్వేగ సందేశాన్ని విడుదల చేశారు. “మీ అందరి నుండి వేలాది సందేశాలు వ చ్చా యి. నన్ను నిరాహార దీక్ష విరమించమని, ఏదైనా తినమని. పెద్దలు, నాయ కులు వచ్చి నాతో కొందరు ప్రేమగా, కొందరు కోపంగా చెబుతున్నారు. మరికొందరు కోర్టుకు కూడా అప్పీల్ చేశారు. ప్రభుత్వం నాతో బలవంతంగా ఆహారం తినిపించాలని, కానీ, నేను ఒకవేళ తిన్నా కూడా దానివల్ల ఏం మారుతుంది.. ఎలాంటి సందేశం వెళ్తుంది.. జవాబుదారీతనం అవసరం లేదు. వాళ్ళు కూర్చుంటారు, తర్వాత వెళ్ళిపోతారనే సందేశం ప్రభుత్వానికి వెళ్తుంది. 20న దేశంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఒక వినూత్నమైన అడుగు ముందుకు వేయాలని సోనమ్ వాంగ్లుక్ అభ్యర్థించారు. 20న చాలామంది ఎంపీలతో కలిసి తామంతా ఈ అంశాన్ని పార్లమెంటుకు అప్పగించ బోతున్నట్లు వెల్లడించారు. అప్పు డే ఈ పోరాటం సరైన చేతుల్లోకి వెళ్ళిందనే నమ్మకం తనకు కలుగుతుందన్నారు. దిల్లీ రాదలచుకున్న వారు ముందుగానే తమ మద్దతును తెలపవచ్చని కోరారు. 70116 70115 నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి తాము వస్తున్నట్లు నిర్ధారించుకోవచ్చని, అధికారిక వెబ్సైట్ లో కూడా తమ పేరును నమో దు చేసుకోవాలని సామాజిక కార్యకర్త సోనమ్ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



