Take a fresh look at your lifestyle.

ఎప్పుడు చూసినా!

ఎప్పుడు చూసినా ఆ కళ్ళల్లో
ద్వేషం కురిపించడమేనా?
కాసేపు అమృత ధారలు వర్షించు!
ఎంత అందంగా ఉంటాయో?
ఎప్పుడు చూసినా ఆ చేతులతో
అందుకోవడంమేనా?
కాసేపు ఇవ్వడం అలవాటుచేయి!
ఎంత తేలిక పడతాయో?
ఎప్పుడు చూసినా ఆ మనసులో
‘‘నా’’ అన్న భావమేనా?
కాసేపు ‘‘మన’’అన్నది నేర్పించు!
ఎంత ఒంటరితనం పారిపోతుందో?
ఎప్పుడు చూసినా ఆ తలపుంలో
తప్పులు వెదకడమేనా?
కాసేపు ఒప్పులకు మెప్పులు పంచు!
ఎంత ప్రశాంతత పలకరిస్తుందో?
ఎప్పుడు చూసినా సమాజాన్ని
ప్రశ్నలతో  నిలదీయడమేనా?
కాసేపు నిన్ను నువ్వే పరీక్షించుకో!
ఎంత అజ్ఞానం వదిలిపోతుందో?
ఎప్పుడు చూసినా భాద్యతలు
నువ్వే మోయడమేనా ?
కాసేపు చూసేవారికి ఇచ్చుకో!
ఎంత బరువన్నది తెలిసిపోతుంది?
ఇవ్వడం ఆకళింపు చేసుకో,
నవ్వించడం అలవాటుచేసుకో!
చీకటి కోణాలను క్షమించు
ప్రభాత కిరణాలను ఆహ్వానించు!
ఇంకేముంది!
నీలో దేముడు దర్శనమిస్తాడు!
ఎందరికో సాక్షాత్కారమిస్తాడు!

– ఉషారం
9553875577

Leave a Reply