అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు పోయాయి

  •  కాంగ్రెస్‌ను నమ్మి వోటేస్తే నట్టేట ముంచారు
  •  ప్రజలు మరోమారు వోటేసే ధైర్యం చేయరు
  •  మెదక్‌ బిఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి
  • పార్టీ నేతల సమావేశంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు

మెదక్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : రాష్ట్ర ప్రజల పరిస్థితి అన్న వస్త్రాల కోసం పోతే.. ఉన్న వస్త్రాలు పోయినట్లయ్యిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. మెదక్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అభ్యర్థికి మద్దతుగా మెదక్‌ నియోజకవర్గం పాపన్నపేటలో బీఆర్‌ఎస్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్‌ హావ్నిలు నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో వోటేశారన్నారు. ఒకసారి మోసపోయారు.. మళ్లీమళ్లీ మోసపోతారా అని ఆయన ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఎంపీగా గెలిపించుకుం దామని పిలుపునిచ్చారు. నమ్మి వోటేస్తే కాంగ్రెస్‌ వాళ్లు నట్టేట ముంచారన్నారు. డిసెంబర్‌ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.. ఇప్పటికీ దిక్కలేదని, అప్పు కట్టాలని రైతులకు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని గుర్తు చేశారు. రూ.2 లక్షలు రుణమాఫీ కానివాళ్లు బీఆర్‌ఎస్‌కు వోటెయ్యాలని కోరారు. ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తామని ఇవ్వలేదని, పక్కపార్టీ వాళ్ల ఇండ్ల చుట్టు రేవంత్‌రెడ్డి తిరుగుతున్నడని విమర్శించారు. రేవంత్‌రెడ్డి రైతులను గాలికి వోదిలేసిండ్నని..వందరోజుల్లో హావ్నిలు నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్‌ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో చురుకు పెడితేనే కాంగ్రెస్‌ దారికొస్తుందన్నారు. తాము రైతుబంధు ఇస్తామంటే ఎన్నికల కమిషన్‌కు కంప్లయింట్‌ చేసి ఆపిందని.. రైతుబంధు దుక్కికో.. నాటుకో ఉపయోగపడాల్సిన డబ్బులు పంట కోతకొచ్చినా రైతుబంధు రాలేదన్నారు. రైతుబంధు కోసం తాము ఉంచిన డబ్బులు కాంగ్రెస్‌ కాంట్రాక్టర్లకు ఇచ్చిందని.. కాంగ్రెస్‌ పాలనలో కరెంటు మోటర్లు కాలిపోతున్నాయని తెలిపారు. రైతు భరోసా రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్‌ మోసం చేసిందన్నారు. మోసం చేసిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఎప్పుడంటే అప్పుడు నీళ్లిచ్చామని.. రెండు పంటలు పండిరచుకునేలా కేసీఆర్‌ నీళ్లిచ్చారన్నారు. కాంగ్రెస్‌ వంద రోజుల పాలనలో 200 మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో నీళ్లు తగ్గి కన్నీళ్లు పెరిగినయన్నారు. రూ.4వేలు పెన్షన్‌ ఇచ్చే వొరకు రేవంత్‌కు అవ్వాతాతల కాళ్ల్లు వొత్తాలన్నారు. జనవరి నెల పెన్షన్‌ రేవంత్‌ సర్కారు ఎగ్గొట్టిందని.. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుధ్ది చెప్పాలని.. కాంగ్రెస్‌కు వోటేస్తే వాళ్ల అబద్దాలను ఆమోదించినట్లేనన్నారు.

ఆడబిడ్డల ఖాతాల్లో ప్రతినెలా రూ.2500 వేస్తామని రేవంత్‌ మోసం చేశారని.. కాంగ్రెస్‌ను వోడిస్తేనే హావ్నిలు అమలు చేస్తారని చెప్పారు. కల్యాణ లక్ష్మి లక్షకు తోడు తులం బంగారం ఇస్తానని, నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేలు ఇస్తామని రేవంత్‌ మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని అసెంబ్లీలో మంత్రి భట్టి అబద్ధాలాడరన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలకు రేవంత్‌ నియామకపత్రాలు ఇచ్చారన్నారు. చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్‌ స్కూటీ ఇస్తామని మోసం చేశారని..ఇన్ని మోసాలు చూసినంక కాంగ్రెస్‌కు ఎవరైనా వోటేస్తారా..అంటూ హరీష్‌ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ప్రతిహావ్ని నెరవేర్చే వరకు వెంటాడుతామన్నారు. దుబ్బాక ప్రజలను బీజేపీ రఘునందన్‌రావు మోసం చేశారన్నారు. రఘునందన్‌రావుని దుబ్బాక ప్రజలు బండకేసి కొట్టారన్నారు. పదేళ్లలో సామాన్యులకు బీజేపీ చేసిందేవ్ని లేదన్నారు. బీజేపీ పాలనలో పెట్రోల్‌, డీజిల్‌, అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగాయని.. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని హరీష్‌ రావు ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *