చెన్నై, జూలై 8 : స్టార్ హీరో చియాన్ విక్రమ్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. విక్రమ్‌కు ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తమిళ వి•డియా పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన పొన్నియిన్ సెల్వన్ టీజర్ లాంచ్‌కి విక్రమ్ హాజరు కావాల్సి ఉండగా ఇలా జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తమిళనాట ఉన్న స్టార్ హీరోల్లో చియాన్ విక్రమ్ కూడా ఒకరు. భాషతో సంబంధం లేకుండా విక్రమ్ తమిళం, తెలుగు, హిందీలో సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అటు తెలుగులోనూ విక్రమ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విక్రమ్ ఆరోగ్యంపై వచ్చిన వదంతులను ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం కొట్టిపారేశాయి. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరమేమి లేదని తెలిపారు.