•నల్గొండ అభ్యర్థిగా కంచర్ల కృష్ణా రెడ్డి, భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేష్
•ఖరారు చేసిన అధినేత కెసిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23 : సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంఎల్ఏ, మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరును పార్టీ అధినేత కెసిఆర్ ఖరారు చేశారు. 1991లో కాంగ్రెస్ పిర్టీ నుంచి కార్పొరేటర్‌గా పని చేసిన పద్మారావు గౌడ్ 22001లో టిఆర్ఎస్లో చేరారు. పార్టీ గ్రేటర్ అధ్యక్షునిగా, కార్పొరేటర్‌గా, అనంతరం ఎంఎల్ఏగా ఎన్నికైన ఆయన 2014లో టీఆర్ఎస్ అధిరాకంలోకి రాగానే మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018 ఎన్నికల్లో ఎంఎల్ఏగా గెటుపొంది ఉప సభాపతిగా పనిచేశారు. తర్వాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో పద్మారావు సికింద్రాబాద:• నుంచి ఎంఎల్ఏగా గెలుపొందారు. ఇక నల్గొండ అభ్యర్థిగా కంచర్ల కృష్ణా రెడ్డి, భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేష్ పేర్లను ఖరారు చేశారు.





