సబితారెడ్డి సమక్షంలో బిజెపి పార్టీకి చెందిన

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 6: కందుకూరు మండల పరిధిలోని గూడూరు గ్రామంలో మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,బిఆర్ఎస్ నాయకులు కాకి దశరథల ఆధ్వర్యంలో బిజెపి పార్టీకి చెందిన 50మంది  కార్యకర్తలు సోమవారం సబితారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,అభివృద్ది,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తమ పార్టీలో చేరడం జరుగుతుందని ఆమె తెలిపారు. నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రహించిన యువత బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఈ ఎన్నికల్లో తన గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో సురసాని సురేందర్ రెడ్డి,కాకి దశరథ,శ్రీహరి, బలరాం,బిక్షపతి,రామకృష్ణ,అయినవోలు మహేందర్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,నరసింహ, బుడ్డోల నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page