ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైన వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు తీసుకొచ్చి రైతు రాజ్యాన్ని నెలకొల్పేందుకు సీఎం కేసీఆర్ సమగ్ర వ్యవసాయ విధానాన్నిఅమలులోకి తెచ్చాక రైతులు ఏపంటలేయాలో ఏ పంటలు వేయోద్దో తెలియక ఏదో ఒక సమస్యతో ఏడాదంతా సతమతం అవుచున్నారు.ఏ పంటకు ఎంత ధర పలుకుతుందో తెలియడం లేదు..ఏ పంట ఉత్పత్తికి ప్రకృతి సహకరిస్తుందో తెలియక రైతులు తెలీక గందరగోళం ఒక వైపు, ఎరువులు, విత్తనాల అవసరాలపై అంచనాలు తప్పి, ఇదే అదనంగా నకిలి విత్తనాల విక్రయం బెడద తప్పడం లేదు. రాష్ట్రంలో నకిలి విత్తనాలు విక్రయించే వారిపై కఠినచర్యలు తీసుకున్నప్పటికీ దళారుల చేతిలో చిక్కాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద వైఖరిని పసిగట్టి తెలంగాణ ప్రభుత్వం వరి వేస్తే ఉరి అవుతుందని, ఆరుతడి పంటలేయాలంటూ.. వ్యవసాయ శాఖ ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు ముమ్మరంగా ప్రచారం చేస్తుంది.తొలకరి జల్లులు కురిస్తే చాలు పొలం పనులు షురూ కానున్నాయి.
ఈ సీజన్లో అప్పుడప్పుడు పడ్డ వర్షాలకు, బోరు బావుల దగ్గర ఇప్పటికే మెట్ట పంటల సాగుకు వేసవి దుక్కులు దున్నుతున్నారు. వ్యవసాయ శాఖ సైతం ఆయా పంటల సాగు విస్తీర్ణం అంచనాలు… విత్తనాలు, ఎరువుల అవసరాల్ని గుర్తించింది. నైరుతీ రుతు పవానాలు కూడా ముందస్తుగానే వస్తాయని అంటున్నారు. కానీ.. ఏ పంటకు గిట్టుబాటు ధర వస్తుందో..? ఏ పంటకు రాదో..? అనే ఆయోమయంలో రైతాంగం ఉంది. ప్రభుత్వం చెప్పిన పంట వేస్తే ఉత్పత్తి గాక, గిట్టుబాటు ధర రాకపోతే ఎలా అనేదికొంత ఊగిసలాటలో ఉన్న రైతుకు ప్రకృతి కూడ సహకరించక వద్దన్న ప్రత్తి పంటకేమో అధికంగా దిగుబడి వచ్చింది.ఈ సారి ధరల పరిస్థితి, మార్కెట్ వ్యవహారాలు ఎలా ఉంటోయో తెలీక రైతులు ఏ పంట వేయాలనే సందేహంలో పడ్డారు. పత్తి, మిర్చి ఇతర మెట్ట పంటల్ని వేసేందుకు పొలాల్ని తయారు చేస్తున్నారు. యాసంగి సీజన్‌లో వరి వేయోద్దని, వేయండని, పండించిన దాన్యం కొంటామని, కొనమని గందరగోళం సృష్టించిన కేంద్ర ప్రభుత్వం నిర్వాహకం వల్ల, మద్దతు ధర వంటి సమస్యల వల్ల అన్ని రకాల పంటలకూ నష్టమేర్పడింది. ఖరీఫ్ సీజన్ లో రైతును ఖన్ప్యూజన్ లోకి నెట్టకుండా ఏ పంటలు వేసుకోవాలో వారికి స్వేచ్ఛను ఇవ్వాలని అపూడు ఈ గందరగోళం ఉండదని అన్నదాతలు చెప్పడం గమనార్హం.
పంటలు దిగుబడి కోసం నకిలి విత్తనాలతో మోసపోవద్దని, రైతు చైతన్య యాత్రల్లో భూసార పరీక్షలు, భూగర్భ జలాలు, పంట రుణాలు, వ్యవసాయ పరికరాలు, హరితహారం, సాగు భూముల గుర్తింపు వంటి విషయాలతో పాటు ఆరుతడి పంటల్ని వేయాలని ప్రచారం చేశారు. ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా నిర్ణయించిన మేరకు ఆరుతడి పంటల వైపు రైతుల్ని మళ్లించేందుకు చైతన్య యాత్రలు చేశారు. ఆరుతడి పంటల్లో పత్తి, మిర్చి, కందులు, సోయాబీన్, ఆముదం,పెసర, మొక్కజొన్న, సజ్జ, జొన్న, పొద్దు తిరుగుడు, వేరుశనగ వంటి పంటలేస్తారని అంచనా వేశారు. వర్షాలు సకాలంలో కురిసి రిజర్వాయర్లు, చెరువులు నిండి, భూగర్భ జలాలు పెరిగితే అంచనా కంటే కూడా పంటల సాగు పెరిగే అవకాశముంది.
రైతులు అధిక ఆదాయం పొందడానికి విత్తన కంపెనీలతో యంఓయూ చేసుకొని మార్కెట్ లో ఉన్నధర కంటె కూడా 20శాతం ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు.దేశంలో విత్తన పంటల సాగు,విత్తనోత్పత్తి పెంచేలా కృషి చేసేందుకు ఎస్ సీఏ అహర్నిషలు కృషి చేస్తుంది.అయితే విత్తన పంటలు ఎలా సాగు చేయాలి.నాణ్యత రావడానికి ఏలాంటి ప్రమాణాలు పాటించాలి.విత్తనాల నాన్యతను ఎలా గుర్తించాలో అధునాతన పరిజ్ఞానం వినియోగంతో పాటు కచ్చితమైన పరిక్షల వ్య్వస్థను ఎస్ సీఏ రూపోందిస్తున్నది. ఇందులో కూడా ప్రవేటు కంపెనీల పెత్తనం నడుస్తోందనే విమర్శ ఉంది.తెలంగాణలో పండించిన ధాన్యంకు అంతర్జాతీయ మార్కెట్లలో భారీ గిరాకి ఉందని రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ నిర్ధారణ చేసింది.మార్కేట్లో నకిలి విత్తనాల విక్రయించే దళారులపై ఉక్కుపాదం మోపిన రైతులకు ఏదో ఒక మూలన మోస పోక తప్పడం లేదని, ఆ బెడద తీరాలంటే పీడీ.ఆక్ట్ పెట్టి, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోని, టాస్క్ ఫోర్స్ బృందాలు తమ పరిధిలోని లైసెన్సడ్ విత్తన విక్రయదారుల దుకాణాలు, గోదాంలు,నర్సరీలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు.
యాసంగిలో వరి వేయకుండా ఆరుతడి పంటలు వేయవద్దని,ప్రత్యామ్నాయంగా పత్తి, మిర్చి, కంది,పెసర వేయమని చెప్పినందున రైతులు ఆ పంటలేశారు.గత సంవత్సరం వద్దన్నప్రత్తి కేమో గతేడాది కంటే మంచి ధర వచ్చింది.కానీ వరి మీద మక్కువతో గతేడాది కంటే సగం సాగు విస్తీర్ణం తగ్గింది.ప్రత్యామ్నాయంగా వేసిన కందికి మాత్రం ధర రాక తీవ్రంగా నష్టపోయారు.ఈ సారి కందికి బదులు పాత పద్ధతి మాదిరే పత్తి వేయాలని రైతులు ఆలోచిస్తున్నారు.అటువైపు మళ్లి ఎక్కువ సాగు చేస్తే నిజంగానే ధర రాకుండా పోతే మళ్లీ నష్టపోతామేమో అనే భయాందోళనకు గురవుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో నకిలీ విత్తన వ్యాపారులు పంజా విసురుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఇప్పటికే నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేసినట్లు ప్రచారం ఊపందుకుంది.
ఈ సంవత్సరం తెల్ల బంగారం ధర మార్కెట్ లో గిట్టుబాటు ధర పలుకడం వలన పలువురు రైతులు ఆ విత్తనాలను కొనుగోలు కూడా చేశారు.ఇక ఆ విత్తనాలు సాగు చేస్తే గాని తెలియదు. నకిలీ విత్తనాల నివారణకు ఫర్టిలైజర్ దుకాణాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి, అనుమతులు లేకుండా విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని,టాస్క్ ఫోర్సు పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలను విక్రయం చేసిన వ్యాపారులపై ఉక్కుపాదం మోపిన,పీడీ, ఆక్ట్ పెట్టిన ప్రయోజనం కాన రావడం లేదు. రసీదులు లేకుండా విత్తనాలు కొనుగోలు చేయవద్దని, కల్తీ విత్తనాలు అమ్ముతున్న, తయారు చేసినట్టు తెలిసిన డయల్ 100, వాట్సాప్ నెంబర్ 7901100100 సమాచారం అందించాలని రైతులకు పోలీసులు సూచించారు.

కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్.9866255355