- ఎల్బీనగర్ నియోజకవర్గం మహిళ కేటాయిస్తే.. మద్దతిచ్చి గెలిపించుకుంటాం
- మహిళా ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంచల ప్రకటన
ఎల్. బి. నగర్, ప్రజాతంత్ర(సెప్టెంబర్ 29) : కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు పేరిట ఓట్లు దండుకోవడానికి కుట్ర కు తర లేపుతుందని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఆరోపించారు. మహిళా బిల్లుపై బిజెపికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే రానున్న ఎన్నికల్లో మహిళా బిల్లును అమలుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం మహిళ కేటాయిస్తే సంపూర్ణ మద్దతు ప్రకటించి.. గెలిపించుకుంటామని ఆయన ప్రకటించారు. శుక్రవారం హస్తినపురం జీ.ఎస్.ఆర్.కన్వెన్షన్ హాల్ లో ఎల్.బి.నగర్ నియోజకవర్గ ఆత్మీయ మహిళా సమ్మేళన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు.
జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ కమల సుధీర్ రెడ్డి తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆత్మీయ సమ్మేళనాన్ని సుధీర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని కొనియాడారు. పలురంగాల్లో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తున్న మహిళల ఆర్థిక, సామాజిక రంగాల్లో రాణించాలని ఆయన సూచించారు. మహిళల ఆర్థిక స్వావ లంబన దేయంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. స్వావలంబన,సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అవిరళ కృషి చేస్తున్నారని ఆ ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని అని సుధీర్ రెడ్డి కొనియాడారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళలకు పింఛన్లు,కేసీఆర్ కిట్,న్యూట్రిషన్ కిట్,ఆరోగ్య మహిళ తదితర పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. త్వరలో ‘గృహలక్ష్మి’ పేరిట ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం, మహిళల రక్షణకు షీ టీమ్స్, భరోసా కేంద్రాల ఏర్పాటు, మార్కెట్ కమిటీల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు ప్రకటించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు అమలుపరిచిందని.. హైదరాబాద్ నగరంలో 150 కార్పోరేటర్ లో 75 మంది కార్పొరేటర్లు ఉన్నారని గుర్తు చేశారు. గతంలో ఆడబిడ్డ పుట్టిందంటే అమ్మో ఆడబిడ్డ అని ఆందోళన చెందేవారని ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆడబిడ్డల సంక్షేమానికి అత్యంతప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని సుధీర్ రెడ్డి కొనియాడారు.
ఈ తొమ్మిదేండ్ల సుపరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కొండంత భరోసాను కల్పిస్తున్న దన్నారు. అమ్మాయి పుట్టగానే కేసీఆర్ కిట్ పథకంతో మొదలుకొని పెండ్లికి ఆర్థిక సాయాన్ని అందజేస్తు.. వారి ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళా పథకాన్ని అమలు చేస్తూ న్యూట్రిషన్ కిట్స్ అందజేస్తున్నదన్నారు. గృహలక్ష్మి’ పేరిట సొంత జాగ ఉండి ఇల్లు కట్టుకుంటే మహిళల పేరిట రూ.3 లక్షల ఆర్థికసాయాన్ని అందించాలని నిర్ణయించడం శుభ పరిణామం అన్నారు. అతివలకు రక్షణగా షీ టీమ్స్, భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. మార్కెట్ కమిటీల్లోనూ రిజర్వేషన్ కల్పించడంతోపాటు ఉద్యోగిణులకు ప్రసూతి సెలవులనూ పెంచి మహిళలకు అండగా నిలుస్తున్నదని ఆయన తెలిపారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదుగాలన్న ఉద్దేశంతో విలేజ్ ఎంటర్‌ప్రైజెస్ కార్యక్రమంతో వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి,గ్రామసంఘం నిధుల ద్వారా రుణాలను ఇస్తూ జీవనోపాధిని కల్పిస్తున్నదన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారులుగా,చిన్న తరహా పారిశ్రామిక వేత్తలుగా మారారని.. మహిళలందరూ సద్వినియోగపరచుకోవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు.
*అలరించిన మహిళలు:* మహిళా ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పలువురు మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సతీమణి, జై చంద్ర రెడ్డి చాటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ కమల సుధీర్ రెడ్డి కూడా మహిళలతో కలిసి ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయనంద్ గుప్తా,సీనియర్ నాయకులు ఈశ్వరమ్మ యాదవ్,ఆనంతుల రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు గజ్జల సుష్మా మధుసూధనరెడ్డి,పద్మ శ్రీనివాస్,చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్,ముద్రబోయిన శ్రీనివాసరావు,కొప్పుల విఠల్ రెడ్డి,జిట్టా రాజశేఖర్ రెడ్డి,జిన్నారం విఠల్ రెడ్డి,సాగర్ రెడ్డి,కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ నల్ల.రఘుమారెడ్డి, ఉద్యమకారులు,డివిజన్ల మహిళా అధ్యక్షు రాళ్లు, అధ్యక్షులు,మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు,పలు విభాగాల దేవాలయం ధర్మకర్తలు,పలు విభాగాల అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థ మహిళలు,నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.