నేడు దేశాన్ని పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలపై మతం రంగు పూయాలని చూస్తూ మత రాజకీయాలు చేస్తుంది. బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారాన్ని సాధించేందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందలని ప్రణాళికలు రచిస్తూ ముందుకు పోతుంది.. కానీ తెలంగాణ ప్రజలు అవివేకులు కాదని బీజేపీ నాయకులు గమనించాలి. ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారంతో ప్రజల ఆలోచన విధానం మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మాట ముందు మాట చివర మతాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తూ ప్రశాంతమైన తెలంగాణ ప్రాంతంలో మత ఘర్షణలు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. దానికి నిదర్శనం శాంతి భద్రతలు పరి రక్షించవలసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమీత్ షా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రసంగాలు చేసిన ఘటనలు చాలా వరకు చూశాము.
భారత దేశం భినత్వంలో – ఏకత్వం అని మరిచి లౌకిక వాదాన్ని కించ పరుస్తూ మత ప్రస్తావన తీసుకు వస్తున్నారు. బీజేపీ నాయకులకు కావాల్సింది ప్రజా శ్రేయస్సు కాదు అధికారం.. దాని కోసం ఏ స్థాయికైన దిగజారుతారు. తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేని నాయకులు టిఆర్‌ఎస్ నాయకులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేసులు వేస్తూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. తెలంగాణ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన వారిలో నలుగురు బీజేపీ సభ్యులు పార్లమెంటుకు ఎన్నికైనారు వారిలో ఒక్కరు కేంద్ర సహ?యక శాఖ మంత్రి అయ్యారు. కానీ వారు రాష్ట్రానికి ఒక నవోదయ పాఠశాల, ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ ప్యాక్టరీ, పసుపు బోర్డు వంటి మొదలయినవి ఒక్కటి తీసుకు రాలేదు పైగా టిఆర్‌ఎస్ ప్రభుత్వపై తప్పుడు ఆరోపణలు మోపుతూ అవినీతి చిట్ట బయట పెడతామని బ్లాక్ మెయిల్ రాజకీయంతో పబ్బం గడుపుకుంటున్నారు.
కేసిఆర్ ను జైల్ పంపుతామని పలుమార్లు అంటూ రాజ్యంగా బద్దమైన ముఖ్య మంత్రి పదవిని కూడా అగౌరవ పరుస్తూ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధి బాగుంది అని పొగుడుతుంటే ఇక్కడి నాయకులు కేసిఆర్ కుటుంబం పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని కేంద్ర ప్రభుత్వ గణాంక సంస్థలు తమ నివేదికలలో వెల్లడిస్తున్నది వాస్తవం కాదా బీజేపీ నాయకులు చెప్పాలి ? దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదా ? టిఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల పేర్లు మార్చి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం వాస్తవం కాదా ? బీజేపీ రాష్ట్ర నాయకులకు తెలంగాణ ప్రజలపైన ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకు రండి… కానీ అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వస్తాము అంటే తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరని గమనించాలి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమై అన్ని రంగాలలో ప్రపంచ దేశాలతో పోటి పడి ముందుకు పోతుంది.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రపంచ పారిశ్రామిక వేత్తలు అంత తెలంగాణ వైపు చూస్తున్నారు అంటే ఇక్కడ శాంతియుత వాతావరణం కల్పిస్తూ పరిశ్రమల రాకతో తెలంగాణ యువతకు ఉపాధి దొరుకుతుంది.
రాష్ట్రం ఏర్పడి దాదాపు ఎనిమిది ఏళ్లు అవుతున్న ఎలాంటి అవాంఛనీయ మత ఘర్షణలు జరగకుండా శాంతియుత వాతావరణంలో అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆనాడు తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చాము అని చెబుతూనే పార్లమెంటు సాక్షిగా తెలంగాణపై విషం చిముతుంది. పైగా తెలంగాణకు మేము ఇచ్చిన నిధులతో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని గొప్పలు చెబుతున్నారు అది అవాస్తం అని టిఆర్‌ఎస్ నాయకులు పలుమార్లు చెప్పడామే కాకుండా తెలంగాణకు మీరు నిధులు ఇచ్చినట్లు ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకు రాండి అని ప్రజ ప్రతినిధులు సవాలు విసిరిన ఈ రోజు వరకు సప్పుడు లేదు. ఆనాటి విభజన హమీలు ఈనాటి వరకు పరిష్కరించలేదు అంటే తెలంగాణ ప్రజలపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. నేడు దేశం మొత్తం తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని బీజేపీ కంకణం కట్టుంకుంది దాని కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతుంది. బీజేపీ ఏతర రాష్ట్ర ప్రభుత్వాలపై విచక్షణ చూపెడుతూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు వచ్చినప్పుడు ఎదో ఒక విద్వేషం సృష్టించి మతని జోడించి రాజకీయ లబ్ధి పొందుతున్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో పేదలకు చేసింది ఏమి లేదు మతం పేరుతో అధికారం సాధిస్తున్నారు. ఆ మతంపైన అయినా స్థిరంగా ఉన్నార అంటే అదీ లేదు..! మతంపై అవహేళన చేసినా వారిని పార్టీలోకి తీసుకుంటున్నారు.. దేశంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని పార్టీలో జాయిన్ చేసుకుని దేశం కోసం ధర్మం కోసం అంటున్నారు. బీజేపీకి ఒక సిద్దాంతం అంటు లేదు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ అదాని, అంబానిలకు కట్ట పెడుతున్నారు దేశంలో పెట్రోల్, డిజిల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో అమతంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీటనింటి దృష్టి మారల్చాడానికి మతాన్ని రాజేస్తున్నారు కానీ బీజేపీ నాయకుల మాయ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని గమనించాలి.
– మిద్దె సురేష్, కవి, వ్యాసకర్త
9701209355