పోరాట, ఉద్యమాల ఫలితం
తెలంగాణ రాష్ట్ర అవతరణ
కాళోజీ, జయ శంకర్ సార్ స్పూర్తి
బంగారు తెలంగాణ
అమరుల త్యాగాల నేలపై
సిరులు పసిడి మాగానితో
తెలంగాణ దర్శనమిస్తుంది
జీవ నదుల సంగమమైన
కరువుతో అల్లాడుతున్న తెలంగాణ
పాలమూరు వలస బతుకులు
రైతుల బలవన్మరణాలు ఆగాలని
ప్రతి ఎకరం నీటి బొట్టుతో
తడవాలని సిద్దించి ప్రారంబించినదే
కాళ్లేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి
ఎత్తిపోతల పథకం త్వరితగతిన
పూర్తి చేసి రైతుల కళ్లల్లో
ఆనందం పెదాలపై చిరునవ్వు
రైతే రాజు నినాదానికై
రైతు బంధు, రైతు బీమా పథకం
తీసుకు వచ్చి రైతుకు భరోసాగా
నిలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం
కుల, మతాలకు అతీతంగా
పేదల సంక్షేమానికై తపిస్తూ
బంగారు తెలంగాణ దిశగా
ఆలోచనలు అచరణాత్మకంగా
అమలు చేస్తున్న మన
పెద్దన్న చంద్ర శేఖరుడు…….
– మిద్దె సురేష్, కవి, వ్యాస కర్త
9701209355