ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప్రికాష‌న్‌ డోస్ కు అనుమ‌తించండి

  • 32 లక్షల డోసుల నిల్వ ఉంది…గడువు తేదీ ముగిసే అవకాశం ఉంది..
  • కేంద్రానికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి
  • రాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్
  • ఇంటింటికి వాక్సినేషన్ లో భాగంగా పది రోజుల్లో 1.30 లక్షల మందికి టీకాలు వేసినట్లు వెల్లడి

హైదరాబాద్ ,జూన్ 13: తెలంగాణ వద్ద 32 లక్షల వాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయని, గడువు తేదీ ముగిసే అవకాశం ఉందని వివరించారు. అర్హులకు ప్రికాషనరీ డోసు ఇచ్చేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి మ‌నుసుక్ మాండ‌వీయ‌కు విజ్ఞ‌ప్తి చేశారు. నిక్షయ్ మిత్ర క్యాంపెయిన్, రాష్ట్రీయ నేత్ర జ్యోతి అభియాన్, హర్ ఘర్ దస్తక్ క్యాంపెయిన్ -2.o పై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మనుసుక్ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యారోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెంగల్ రావు నగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం నుండి వీసీలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు, సూచనలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న టీబీ నిర్మూలన, కంటి పరీక్షలు, కొరోనా వాక్సినేషన్ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…దీంతో పాటు పలు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ల రూపంలో కొరోనా వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో రెండు డోసులు పూర్తి చేసుకొని అర్హులైన వారికి ప్రికాష‌న‌రీ డోస్ ఇవ్వడం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యమవుతుందన్నారు.

ప్ర‌భుత్వ వైద్యంలో ప్ర‌స్తుతం 60 ఏళ్లు దాటిన వారికి మాత్ర‌మే ప్రికాష‌న‌రీ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తించిన కేంద్రం…. 18 ఏళ్లు పైబ‌డిన వారికి ఏప్రిల్ 10 నుంచి ప్రికాష‌న‌రీ డోస్ ఇచ్చేందుకు కేవ‌లం ప్రైవేటు హాస్పిటల్స్ కి అనుమ‌తించింది. ఈ క్ర‌మంలో ప్రైవేటుతో పాటు ప్ర‌భుత్వ కేంద్రాల్లోనూ 18-59 ఏళ్ల వ‌య‌స్సున్న‌ వారికి ప్రికాష‌న‌రీ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తించాల‌ని గతంలో కేంద్రానికి మంత్రి హరీశ్ రావు రెండు సార్లు లేఖ రాశారు. తాజాగా మరోసారి వీ సీలో కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో వాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతుందని మంత్రి హరీశ్ రావు కేంద్ర మంత్రికి వివరించారు. జూన్ 3 న రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటింటికి వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా పది రోజుల్లో 1.30 లక్షల మందికి వాక్సిన్ వేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 12 ఏళ్లు పై బడిన వారికి మొత్తంగా.. మొదటి డోసు 104.78%, రెండో డోసు 99.72% పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కొరోనా పరిస్థితులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నదని, దానికి అనుగుణంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అర్ టి పీసీఆర్ పరీక్షలు మరింత పెంచనున్నట్లు తెలిపారు. టీబీ నిర్మూలన కోసం అమలు చేస్తున్న నిక్షయ్ మిత్ర కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని, రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తామని చెప్పారు. కంటి ఆపరేషన్లు మరింత పెంచేలా టీచింగ్ హాస్పిటల్స్ , జిల్లా దవాఖానాల్లో ల్లో పేఖో మిషన్లు సమకూర్చి, లక్ష్యం చేరుతామని తెలిపారు.సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ, సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, సీఎం ఓఎస్డి గంగాధర్, డీహెచ్ శ్రీనివాస్ రావు, TSMSIDC ఎండి చంద్రశేఖర్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page