Take a fresh look at your lifestyle.

నిరుద్యోగ జాగారం

ఆ లీకేజీ ఈ లీకేజీ
గలీజైన పేపర్‌ ‌లీకేజీ
నిగ్గు తేల్చాల్సిన
బంగారు తెలంగాణ
పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌
‌పేపర్‌ ‌లీకేజీల
వ్యవహారంలో
ఉలుకు పలుకు
లేని పక్షాలు
ఇప్పుడు
ఎవరి పక్షం వారిదే
అంతా ఏక పక్షం
ఎవరి జెండా వారిదే
జెండా లేని కర్ర పెత్తనం
సూది పార్టీ
సూది మొన పార్టీ
దబ్బనం పార్టీ
దబ్బనం మొన పార్టీ
ఇప్పుడు ఏ సూదిలో
ఏ పార్టీ
దారం దూరుస్తుందో
దబ్బనం పార్టీలకే ఎరక
అధికార పక్షం
సంకలో దూరిన పక్షాలలో
రెక్కలు తెగే పక్షులెన్నో
యువతరం నవతరం
గళమెత్తని తరం
ఉడుకు రక్తం ఉడుకుతునే ఉంది
నిరుద్యోగం జాగారం చేస్తూనే ఉంది
ఆకాశంలో
పక్షులన్నీ కలిసికట్టుగా విహరిస్తున్నయి

   – కట్టెకోల చిన నరసయ్య
                               9951260316

Leave a Reply