సేవాతత్పరులు
సంరక్షణా నేత్రులు
ఆరోగ్య ప్రదాతలు
మానవతామూర్తులు
వైద్య సహాయక నర్సులు
వ్యాధి పీడిత బాధితులకు
సపరిచర్యలు చేసే దాత్రులు
రోగకారక మహమ్మారులపై
నిశబ్ద పోరు చేసే వీరసేనలు
అపత్కాల సమయంలో
ఆదరించే ఆపథ్బాంధవులు
భరోసా వచనాలు వల్లించి
విశ్వాసం పొదిపే ధీరజులు
రక్తమోడే క్షతగాత్రులను
చేరదీసే ఆపన్న హస్తాలు
కుళ్ళిన వ్రణాలను సైతం
శుభ్రం చేసే సహనశీలురు
కుటుంబాన్ని విడిచి
నిద్రాహారాలు మరిచి
వృత్తి దైవంగా తలచి
రోగుల సేవలో తరించే
నికార్సు మానవీయులు
ప్రాణ పరిరరక్షణే లక్ష్యంగా
వ్యాధి నయమే ద్యేయంగా
వైద్య సహాయమే సర్వంగా
నిత్యం శ్రమించే దీక్షాదక్షులు
కనిపించే దేవతలకు
సకలజన నీరాజనాలు
సేవలందించే నర్సులకు
భారతజాతి హారతులు
(మే 12 న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్బంగా..)
– కోడిగూటి తిరుపతి, 9573929493