ధరల భూతం జడలు విప్పి

విపణిలో వీరంగం సృష్టిస్తుంది

 

ద్రవ్యోల్బణం రెక్కలు విచ్చి

వీదుల్లో వీర విహారం చేస్తుంది

 

నేలకు ఒరిగే రూపాయి విలువ

నింగిని తాకే వస్తు సేవలు వెరసి

 

ఆర్థిక వ్యవస్థ సమస్తం అస్తవ్యస్తం

జనజీవనం ఆసాంతం అంధకారం

 

ఇపుడు

వంట గ్యాస్‌ ‌సిలిండర్‌

 

‌గుది బండల రూపేత్తుకుని

జీవితాల్ని చిదిమేస్తున్నయ్‌

 

‌పెట్రోల్‌ ‌డీజిల్‌ ఇం‌ధనం

పెను మంటలుగా పెట్రేగి

సామాన్యుల దహిస్తున్నయ్‌

 

‌కరెంట్‌ ‌చార్జీల బిల్లులు

గుండెలో దడ రేపుతున్నయ్‌

 

ఒకవైపు ధరాఘాతం

మరోవైపు పన్ను పోటు

వెరసి కొనబోతే కొరివి

తినబోతే అడవి చందం

 

దేశ సంపద కొల్లగొట్టి

జనావళిని తొక్కిపెట్టి

 

కార్పొరేట్లకు కట్టబెట్టే

పాలకుల కుళ్లు కుట్రలే

ఈ దీనావస్థకు కారణం

 

ఇప్పటికైనా…ఏలికలు

పెరిగే ధరలకు కళ్లెం వేస్తేనే

సుంకాలకు రాయితీ ఇస్తేనే

ఆర్థిక అవస్థలు కాస్త తీరేది

జనం కూసింత కుదుటపడేది

 

(ధరల పెరుగుదలకు నిరసనగా )

– కోడిగూటి తిరుపతి, 9573929494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page