‘‘‌దేవులపల్లికి’’ జోహార్‌ !

అక్షర యోధుడు
ఉద్యమ ధీరుడు
అభ్యుదయ సూరీడు
దేవులపల్లి ప్రభాకరుడు
నిష్క్రమించారని తెలిసి
సాహితీ జగతి చినబోయింది
తెలుగునేల దుఃఖసంద్రమైంది

ఓరుగల్లు జిల్లాలలో జన్మించి
అందనంత ఎదిగిన అగ్రజుడు

తెలంగాణ ఉద్యమాలన్నింట
కీలక పాత్ర పోషించిన వీరుడు

రాష్ట్ర అధికార భాషా సంఘం
తొలి అధ్యక్ష బాధ్యత చెప్పట్టి
విశిష్ట సేవలందించిన ఖ్యాతుడు

గురజాడ జీవత చరిత్ర రచించి
ప్రతిష్టాత్మక యునెష్కో అవార్డ్
అం‌దుకున్న సారస్వత పుత్రుడు

అరవయ్యో దశాబ్దం మొదలు
కవి, కాలమిస్టు,రచయితగా
సంపాదకునిగా పలు పత్రికలకు
కలం సమర్పించిన త్యాగదనుడు

సాహితీ వికాసమే స్వప్నంగా
సమాజ హితమే సర్వస్వంగా
జీవనం సాగించిన ఆదర్శనీడు

సాహితీ శ్రేష్ఠ
విలువల విశిష్ట
తెలుగు కీర్తి ప్రతిష్ట
దేవులపల్లి ప్రభాకరకు
యావత్‌ ‌తెలుగు జాతి
అశ్రు నయన నివాళులు
విసన్న వదన నీరాజనాలు
(దేవులపల్లి ప్రభాకర్‌ ‌రావుకు అక్షర నివాళి అర్పిస్తూ…)
– కోడిగూటి తిరుపతి,9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page