ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : హైదరాబాద్ లోని గేమ్ పాయింట్ హైటెక్ ఎరీనాలో జరిగిన తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్ షిప్ లో రోహన్ ఆర్య గోండి, ఆర్యా ద్వివేది జంట పురుషుల, మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. తెలంగాణకు చెందిన నెం.1 ప్లేయర్ రోహన్ 11-1, 11-0, 11-1తో కరణ్ వశిష్ట్ ను ఓడించగా, ఆర్య 11-4, 5-11, 11-8, 11-3తో రాష్ట్ర అగ్రశ్రేణి క్రీడాకారిణి ఈశ్వరియా పయ్యన్ ను ఓడించింది. గేమ్ పాయింట్ సహకారంతో తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్ షిప్ ను నిర్వహించింది. ఈ టోర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి అద్భుతమైన స్క్వాష్ ప్రతిభను ప్రదర్శించారు. గేమ్ పాయింట్ బాగా నిర్వహించిన టోర్నమెంట్ దాని విజయానికి ఉదాహరణ, ఇది శారీరక శ్రేయస్సును ప్రోత్సహించడంలో క్రీడల ప్రాముఖ్యతను చెబుతుందని ముఖ్య అతిథి, మాజీ పార్లమెంటు సభ్యురాలు, బుట్టా ఎడ్యుకేషన్, మెరిడియన్ స్కూల్స్ వ్యవస్థాపకురాలు రేణుకా నీలకంఠ వ్యాఖ్యానించారు. గొప్ప ప్రతిభను ప్రదర్శించి ఛాంపియన్లుగా అవతరించిన క్రీడాకారులందరినీ అభినందించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో 96 మ్యాచ్ ల్లో 98 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఆర్ ఏ వైస్ ప్రెసిడెంట్ వి.శ్రీశైలం, టీఎస్ ఆర్ ఏ కార్యదర్శి శ్రీవాసు సుధాగాని, మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.