వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 9; ఈ రోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంచినీటి పైప్ లైన్ శంకుస్థాపనల కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం *స్థానిక బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి కి* ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాలనీలలో శంకుస్థాపనలు జరిపిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డి మరియు జలమండలి అధికారులు. సమాచారం ఇవ్వలేదని అడిగినందుకు మరియు డివిజన్లోని శ్రీ శ్రీనివాస కాలనీలో ఎమ్మెల్యే అనుచరుల ఫోటోలు లేనందున మరియు కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ప్రోటోకాల్ ప్రకారం స్థానిక కార్పొరేటరకి సమాచారం ఇచ్చినందుకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేసి మరొక కాలనీలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారం కాలనీ సభ్యులు సమాచారం ఇచ్చినందున గౌరవ ఎమ్మెల్యే కాలనీలో ప్రారంభత్సవ కార్యక్రమాన్ని చెయ్యకపోవడం చాలా విచారకరమైన విషయమని అలాగే ప్రోటోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వకపోవడంపై నాకు నష్టపోయేది ఏమీ లేదని కాలనీల అభివృద్ధి తన లక్ష్యమని అన్నారు మరియు ప్రోటోకాల్ లో భాగంగా తమ ఉపాధ్యాయల ఎమ్మెల్సీ రెడ్డి పేరును శిలాఫలకాలపై ఎందుకు పెట్టలేదని మరియు తమ పార్టీకి సంబంధించిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీల పేర్లను ఎందుకు వేశారని ప్రశ్నిస్తూ కాలనీలో ఏర్పాటుచేసిన శంకుస్థాపన బోర్డు వద్ద కాలనీవాసులతో కలిసి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక బయటాయించి నిరసన తెలుపడం జరిగింద అనంతరం బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ కు సంబంధించిన వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్తే వినోద్ కుమార్ ఇదిగో వస్తున్న అదిగో వస్తున్నానని 2,3 గంటలు వరకు వెయిట్ చేయించి రాకపోవడంతో సంబంధిత కార్పొరేటర్ లచ్చి రెడ్డి , చంపాపేట్ కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి మనసురాబాద్ కార్పొరేటర్ నరసింహారెడ్డి , హయత్ నగర్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి , వనస్థలి పురం కార్పొరేటర్ వేంకటేశ్వర రెడ్డి కొత్త పెట్ కార్పొరేటర్ పవన్ కుమార్రు మరియు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వానపల్లి శ్రీనివాస్ రెడ్డి అందరూ కలిసి కుర్చీకి ప్రోటోకాల్ పత్రం ఇవ్వడం జరిగింది మరియు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకూడదని రాబోయే రోజులలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ శ్రీ శ్రీనివాస అధ్యక్షులు చిత్రాంజన్, అధ్యక్షురాలు సరస్వతి,నందకిషోర్, అధ్యక్షులు పాండురంగారెడ్డి,రవికుమార్,సంజీ వరెడ్డి, యాదయ్య,ఆజాద్, అశోక్, సైదులు మరియు నాయకులు రాఘు రామ్ నేత,నరసింహారెడ్డి, శంకరయ్య గౌడ్, విష్ణువర్ధన్ రావు, సందీప్ రెడ్డి, శరత్ కుమార్, శ్రీధర్ రావు,కామేష్, పవన్ రెడ్డి, సురేష్, దుర్గా ప్రసాద్, మరియు తదితరులు పాల్గొన్నారు.