జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ ‌కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : 2022-24 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ ‌కార్డుల జారీ కోసం సమాచార మరియు పౌర సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న అక్రిడిటేషన్‌ ‌కార్డ్‌ల చెల్లుబాటు జూన్‌ 30‌తో ముగియనుండగా 2022-24 సంవత్సరాల్లో అర్హులైన వర్కింగ్‌ ‌జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్‌ ‌కార్డ్‌లు జారీ చేయబడుతున్నాయి. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ ‌మీడియా మరియు న్యూస్‌ ఏజెన్సీల యాజమాన్యాలు తమ సంస్థలకు చెందిన వర్కింగ్‌ ‌జర్నలిస్ట్‌ల పేర్ల జాబితాను 04.06.2022లోపు సమాచార మరియు ప్రజాసంబంధాల విభాగానికి తప్పనిసరిగా సమర్పించవలసిందిగా తమ ప్రకటన ద్వారా తెలిపింది.

స్వతంత్ర వర్గానికి చెందిన జర్నలిస్టులు నేరుగా ఆన్‌లైన్‌ ‌ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్‌ ‌కార్డుల పేర్లను కమిషనర్‌, ‌సమాచార మరియు పౌరసంబంధాలు, హైదరాబాద్‌కు పంపాలి మరియు జిల్లా స్థాయి అక్రిడిటేషన్‌ ‌కార్డుల పేర్లను జిల్లాల సంబంధిత డిపిఆర్‌ఓలకు పంపవచ్చు.  మేనేజ్‌మెంట్‌లు తమ పేర్లను పంపిన జర్నలిస్టులు 25.05.2022 నుండి 04.06.2022 వరకు డిపార్ట్‌మెంట్‌ ‌వెబ్‌సైట్‌ ష్ట్ర••‌జూ://ఱజూతీ.•వశ్రీ•అస్త్ర•అ•.స్త్రశీఙ.ఱఅ ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌ ‌ద్వారా అక్రిడిటేషన్‌ ‌కార్డ్‌ల కోసం తమ దరఖాస్తులను సమర్పించాలని తమ ప్రకటనలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *