కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు చేయూత

  • కేంద్ర ప్రభుత్వం భరోసా
  • ‘పీఎం కేర్స్ ‌ఫర్‌ ‌చిల్డ్రన్‌’‌కు ప్రధాని మోదీ శ్రీకారం
  • పిల్లలకు చదువు, ఆరోగ్యం, ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం
  • కొరోనాతో అనాథలైన పిల్లలకు భారతావని అండగా ఉంటుందన్న ప్రధాని
  • 2014కి ముందు అన్నీ కుంభకోణాలేనంటూ కాంగ్రెస్‌పై విమర్శ

న్యూ దిల్లీ, మే 30 : అమ్మానాన్నలను కోల్పోయిన పిల్లలకు..ఆప్యాయత, వాళ్లు లేరనే లోటు పూడ్చలేనిదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అయినా భరత మాత వి• వెంట ఉందంటూ ఆ పిల్లలకు ప్రధాని భరోసా ఇచ్చారు. కోవిడ్‌ ‌కారణంగా అనాథలైన పిల్లలకు సాయం అందించే పీఎం కేర్స్ ‌ఫర్‌ ‌చిల్డ్రన్‌ ‌ప్రయోజనాలను సోమవారం ప్రధాని మోదీ ఆవిష్కరించారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగ పడుతుందని, దేశంలోని ప్రతి ఒక్కరు వారితోనే ఉన్నారనే భరోసాను కల్పిస్తుందని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వొచ్చి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా కొరోనా మహమ్మారితో అనాథలైన పిల్లలకు చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కేర్స్ ‌ఫర్‌ ‌చిల్ట్రన్‌’ ‌పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన వీడియా కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పథక ప్రయోజనాలను వెల్లడించారు. ఈ క్రమంలో.. సోమవారం పథక ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా విడుదల చేశారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులకు ఉపకార వేతనాలతో పాటు పీఎం కేర్స్ ‌పాస్‌ ‌బుక్‌, ఆయుష్మాన్‌ ‌భారత్‌, ‌జన్‌ ఆరోగ్య యోజన హెల్త్ ‌కార్డులను పంపిణీ చేస్తారు.

లబ్దిదారులకు ఐదు లక్షల వరకు అవసరమయ్యే వైద్య ఖర్చులను కేంద్రమే భరిస్తుంది. ‘పిఎం కేర్స్ ‌ఫండ్‌..‌కొరోనా టైంలో హాస్పిటళ్ల సన్నద్ధత, వెంటిలేటర్ల కొనుగోలు, ఆక్సిజన్‌ ‌ప్లాంట్‌ల ఏర్పాటుకు తోడ్పడింది. తద్వారానే ఎన్నో ప్రాణాలు నిలిచాయి. అయినా దురదృష్టవశాత్తూ కొందరిని దేశం కోల్పోయింది. కొరోనాతో చనిపోయిన వాళ్ల బిడ్డలకు తోడ్పాటుగా, వాళ్ల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకే పీఎం కేర్స్ ‌ఫర్‌ ‌చిల్డ్రన్‌’ ఇప్పు‌డు ఉపయోగ పడుతుందని అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వి• తల్లిదండ్రుల ప్రేమను ఏ ప్రయత్నం భర్తీ చేయక పోవచ్చు. అండగా భరతమాత వి• వెంటే ఉంటుంది. పీఎం కేర్స్ ‌ద్వారా ఈ దేశం వి• ప్రయోజనాలను నెరవేరుస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తో, సంస్థో లేదంటే ఈ  ప్రభుత్వం చేసే ప్రయత్నం మాత్రమే కాదు.. పీఎం కేర్స్‌లో కోట్ల మంది ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును విరాళంగా ఇచ్చారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే కాంగ్రెస్‌ ‌పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014కి ముందు దేశంలో వారసత్వం రాజ్యమేలేదని, ఎక్కడ చూసినా కుంభకోణాలే కనిపించేవని, అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉండవని, దేశం కొత్త శిఖరాలను చేరుకుంటోందని మోదీ అన్నారు. ఈరోజు మా ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. దేశ విశ్వాసం, దేశ ప్రజల విశ్వాసం ఎంతగానో పెరిగింది.

కానీ 2014 ముందు పరిస్థితి వేరేలా ఉండేది. ఎక్కడ చూసినా అవినీతి, వేల కోట్ల కుంభకోణాలే కనిపించేవి. వారసత్వం రాజ్యమేలేది. దేశమంతా ఉగ్రవాదం వ్యాప్తి చెంది ఉండేది. వీటన్నిటితో దేశం అతలాకుతలమైంది. కానీ గడిచిన ఎనిమిదేళ్లుగా దేశం పురోగతి సాధిస్తోంది. బహుశా దీన్ని ముందుగా ఎవరూ ఊహించి ఉండరు. ఈరోజు దేశఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ప్రపంచ వేదికలపై భారత్‌ ‌శక్తివంతంగా కనిపిస్తుందని మోదీ అన్నారు. కొరోనా కారణంగా తల్లిందడ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారులకు పీఎం కేర్స్ ‌పథకం కింద సాయం అందజేస్తారు. ఇది అనాథలైన పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కోవిడ్‌ ‌సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తనకు తెలుసునని.. వారి కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.  కొందరికి ఉన్నత విద్య కోసం విద్యా రుణాలు అవసరమవుతాయి. దానికి సైతం పీఎం కేర్స్ ‌సాయపడుతుంది. అలాంటి వారికి రోజువారీ ఖర్చుల కోసం ఇతర పథకాల ద్వారా నెలకు రూ.4వేలు అందిస్తున్నాం. ఒక ప్రధానిగా కాకుండా కుటుంబ సభ్యుడిగా పిల్లలతో మాట్లాడుతున్నా. ఈరోజు పిల్లల మధ్య ఉన్నందుకు చాలా రిలీఫ్‌గా ఉన్నా. దేశంలోని ప్రతి ఒక్కరు వారితో ఉన్నారనే భరోసాను ఇది కల్పిస్తుంది. అనాథలైన చిన్నారులు పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కువ డబ్బు అవసరమవుతుంది. 18-23 ఏళ్ల వారికి ప్రతినెల స్టైఫండ్‌ అం‌దుతుంది. వారు 23 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత రూ.10 లక్షలు వొస్తాయి. పీఎం కేర్స్ ‌ద్వారా ఆయుష్మాన్‌ ‌హెల్త్ ‌కార్డు అందిస్తాం. దాని ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని ప్రధాని  నరేంద్ర మోదీ అన్నారు.

2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28 మధ్యలో తల్లిదండ్రులు, చట్టబద్ధమైన సంరక్షకులు, దత్తత తల్లిదండ్రులు లేదా ఏకైక ఆధారంగా ఉన్న తల్లినో, తండ్రినో కోల్పోయిన పిల్లలకు ఉపకారవేతనాలు, పీఎం కేర్స్ ‌పాస్‌ ‌పుస్తకాలు, ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌వైద్య బీమా కార్డును అందించ నున్నారు. ఈ పథకంలో భాగంగా.. పిల్లలకు 18 ఏళ్లు నిండేసరికి వారి పేరిట రూ.10 లక్షల సొమ్ము ఉండేలా డిపాజిట్‌ ‌చేస్తారు. 18 నుంచి 23 ఏళ్ల వయసు వరకు ఆ డిపాజిట్‌పై వడ్డీని వారికి ఆర్థిక సాయంగా అందిస్తారు. 23 ఏళ్లు నిండిన తర్వాత పూర్తిగా రూ.10 లక్షలు లబ్దిదారులకు ఇచ్చేస్తారు. అర్హులైన పిల్లలు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు పీఎం కేర్స్ ‌ఫర్‌ ‌చిల్డ్రన్‌ ‌పేరుతో ఒక పోర్టల్‌ ‌ప్రారంభించారు. పేర్ల నమోదు దగ్గర నుంచి దరఖాస్తుల ఆమోద పక్రియ, సాయం అందించటం వరకు అన్నీ ఈ పోర్టల్‌ ‌ద్వారా మాత్రమే సాగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page