కొందరు మంత్రులు, అధికారులతో.. సీఎం కెసిఆర్‌ అత్యవసర సమావేశం ..!

  • నోటిఫికేషన్లు, పథకాలపై అధికారులతో సమీక్ష
  • మంత్రుల ముందు పికే రిపోర్ట్?
  • ‌ముందస్తు ఎన్నికలపై మంత్రులతో సిఎం కేసీఆర్‌ ‌చర్చ?
  • 21న తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం

సిద్ధిపేట, మార్చి 19(ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం అత్యసర మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంత్రులకు ఫోన్లు వెళ్లిన మరుక్షణమే మంత్రులందరూ ఎర్రవెల్లిలోని సిఎం కేసీఆర్‌ ‌వ్యవసాయ క్షేత్రానికి క్యూ కట్టారు. ఎర్రవల్లి ఫామ్‌ ‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సిఎం కేసీఆర్‌ ‌శనివారం అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, మంత్రులతో సమావేశమైన సిఎం కేసీఆర్‌…‌పాలనాపరమైన అంశాలపై చర్చించినట్లు సమాచారం. అధికారులు ఉన్నంతసేపు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, నోటిఫికేషన్ల గురించి చర్చించారనీ సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఐఏఎస్‌ అధికారులు వెళ్లిన తర్వాత…మంత్రులతో రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఈ అత్యవసర మీటింగ్‌లో ప్రధానంగా ముందస్తు ఎన్నికల గురించి మంత్రులతో సిఎం కేసీఆర్‌ ‌మాట్లాడినట్లు సమాచారం.

 

రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్‌ ‌కిషోర్‌(‌పికే) ఇచ్చిన రిపోర్టును మంత్రుల ముందు ఉంచిన సిఎం కేసీఆర్‌…ఏ ఏ ‌వర్గాలు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరెవరూ పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉన్నారనే దానిపై సమగ్రమైన నివేదికను మంత్రులతో సిఎం కేసీఆర్‌ ‌షేర్‌ ‌చేసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో బిజెపి దూకుడుకు ఎలా కళ్లెం వేయాలనే దానిపై కూడా సిఎం కేసీఆర్‌ ‌మంత్రులతో మాట్లాడినట్లు సమాచారం. ఇప్పుడున్న రాజకీయాల గురించి మంత్రులతో మాట్లాడిన సిఎం కేసీఆర్‌…ఈ ఎమర్జన్సీ మీటింగ్‌లో ప్రధానంగా ముందస్తు ఎన్నికల గురించి చర్చించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ సమావేశానికి మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌జగదీశ్‌ ‌రెడ్డి, ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ‌కొప్పుల ఈశ్వర్‌, ‌రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ ‌కుమార్‌, ఎమ్మెల్సీ కవిత తదితరులు హాజరైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఉన్నప•లంగా మంత్రులు, అధికారులతో సిఎం కేసీఆర్‌ ఎ‌ర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే, ఈ నెల 21న తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ శాసనసభా పక్షం సమావేశంను నిర్వహించన్నుట్లు తెలుస్తుంది. వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై మరింత వొత్తిడి తెచ్చేందుకు ఎమ్మెల్యేలు, ఎంపిలకు సిఎం కేసీఆర్‌ ‌దిశానిర్దేశం చేసే అవకాశం ఉందనీ సమాచారం.

21న టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

ఈనెల 21న టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం జరుగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉదయం 11 30 గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం జరుగనుంది.ఈ సమావేశానికి హాజరుకావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు,రైతుబంధు, రైతు సమితుల అధ్యక్షులు, పార్టీ జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని సమాచారం పంపించారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ, ధర్నా, ఆందోళన వంటి నిరసన కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ ఈ ‌సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ అనంరతం సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రుల బృందం ఢిల్లీ బయల్దేరి వెళ్లనుంది. పంజాబ్‌లో పండించే ధాన్యాన్ని నూటికి నూరు శాతం కేంద్రం కొనుగోలు చేస్తున్న విధంగానే తెలంగణలో పండించే ధాన్యాన్ని కూడా కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *