- రూ 2లక్షల రుణమాఫీ చేస్తాం
- ఆర్ ఆర్ ఆర్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలి: మంత్రి పొంగులేటి
కొత్తగూడెం, ప్రజాతంత్ర : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లులు, రేషన్ కార్డులో సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఆర్ఆర్ గెలుపు కోసం పాల్వంచ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ జిల్లాలో పోడు భూముల సమస్య, పోడు రైతులకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీ ఎన్నికలలో కొత్తగూడం నియోజకవర్గంలో సిపిఐ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని, త్వరలోనే రైతులకు రూ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు, కరెంట్ అందించలేదని మాజీ సీఎం కెసిఆర్ ఎన్నికల కోసం మాయమాటలు చెప్పేందుకు కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటనలో కల్లబొల్లి మాయమాటలు చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు అంటూ విమర్శించారు. మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య చిట్ట చివరికి తండ్రి కొడుకుల మధ్య భార్యాభర్తల మధ్య పంచాయతీ పెట్టి పార్టీ బిజెపి అన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకోవాలని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసే ఆవశ్యకత దేశానికి ఎంతైనా ఉందని అందులో భాగంగా రఘురాం రెడ్డి కచ్చితంగా గెలిపించాల్సిన బాధ్యత ప్రజాలందరిపై ఉందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ఆర్ఆర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు,సీపీఐ జిల్లా కార్యదర్శి షబీర్ పాషా, ఎడవెల్లి కృష్ణ, కోనేరు సత్యనారాయణ, బరపాటి వాసు, మైపతి రామలింగం, ఎర్రంశెట్టి ముత్తయ్య,కాల్వ భాస్కర్, నూకల రంగారావు, కొండం వెంకన్న, బాలినేని నాగేశ్వరరావు, చీకటి కార్తీక్, చింత నాగరాజు, రావి రాంబాబు, సంతోష్ గౌడ్, రవికుమార్ భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.