కెసిఆర్‌ పాలనలో దక్షిణ తెలంగాణ ఎడారి

మిషన్‌ భగీరథ పేరు చెప్పి ప్రజలకు మోసం
 డిండి, ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేస్తే నీటి సమస్య ఉండేది కాదు
 నల్లగొండ పర్యటనలో కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ, ప్రజాతంత్ర, మార్చి 13 : కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని…ఊళ్లకు పోతే నీళ్ల సమస్యలతో కళ్ళలో నీళ్లు వొస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. మంచినీటి సమస్యను తీర్చకుండానే మిషన్‌ భగీరథ పేరుతో కెసిఆర్‌ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ..డబ్బుల ఆశతో కేసీఆర్‌ అల్లుడు, కొడుకులు… హైదరాబా ద్‌లో టానిక్‌ షాపులు, దిల్లీలో మందు షాపులు, కాళేశ్వరం పేరుతో దోపిడీ చేసి దక్షిణ తెలంగాణను నాశనం చేశారని విమర్శించారు. అందుకే రిజల్ట్‌ వొచ్చిన రోజే కేసీఆర్‌ నడుము విరగ్గొట్టి దేవుడు శిక్ష వేశారన్నారు. డిరడి, ఎస్‌ఎల్‌ బీసీ పూర్తి చేస్తే ఈ పరిస్థితి వొచ్చేది కాదన్నారు. రోజుకు నలుగురు పార్టీ మారుతుంటే బీఆర్‌ఎస్‌ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. కేసీఆర్‌ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న మొదటి హావిూనే అమలు చేయలేదన్నారు. బీఆర్‌ఎస్‌ మొదటి ఐదేళ్లలో మహిళా మంత్రి లేని రాష్ట్రం కాబట్టే వారి ఉసురు తగిలి కరువు వొచ్చిందని వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేసింది కాంగ్రెస్‌ పార్టీనే అని అన్నారు.

చచ్చిన పాము లాంటింది బీఆర్‌ఎస్‌ పార్టీ అని, ఎంపీ ఎన్నికల్లో ఈ సారి ఒక్క సీటూ రాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. కెసిఆర్‌ నిర్ణయాలతో దక్షిణ తెలంగాణ సర్వనాశనం అయ్యిందన్నారు. నల్గొండ మున్సిపాలిటీలో తాగునీటి సమస్యలపై రివ్యూ నిర్వహించారు. పానగల్‌లోని తాగునీటి శుద్ధి కర్మాగారాన్ని పరిశీలించిన కోమటిరెడ్డి అధికారులకు సూచనలు జారీ చేశారు. ఏ ఊరికి వెళ్లినా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. మిషన్‌ భగీరథతో నీళ్లిచ్చామని చెప్పడం అబద్ధమన్నారు. డిరడి, ఎస్‌ఎల్‌బిసి పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వొచ్చేది కాదని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. ప్రతి రోజు నలుగురు నేతలు పార్టీ మారుతున్నారని..తర్వలో బీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్‌ పార్టీనేనన్నారు. మహాత్మాగాంధీ వర్సిటీలోని ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. ఇటీవల జరిగిన జాబ్‌ మేలాలో ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలియజేశారు. మే నెలలో నల్లగొండలో మరో జాబ్‌ మేలా నిర్వహిస్తామని చెప్పారు. నల్లగొండలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నల్లగొండను ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రూ.600 కోట్లతో చేపట్టే నల్లగొండ ఒఆర్‌ఆర్‌ పనులకు వొచ్చే నెల టెండర్లకు పిలుస్తామని, ఆరు వరసల రోడ్డు పనులకు ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. రోడ్డు, డ్రెయిన్ల పనులు నాణ్యతపై రాజీపడవద్దని కాంట్రాక్టర్లకు ఆదేశించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page