- పంచాయితీలను నిర్వీర్యం చేస్తూ పెత్తనమా
- కెసిఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులివ్వడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర వ్యవహారంగా పేర్కొంటూ తప్పుపట్టడం దురద్రుష్టకరమని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు బదలాయించాలన్నదే 73వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశమన్నారు. విద్య, వైద్యం సహా 29 అంశాలను గ్రామాలకే బదలాయించాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా వాటిపై ఎమ్మెల్యేలకు పెత్తనమిచ్చి గ్రామ పంచాయతీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన కేసీఆర్‌ది చిల్లర బుద్ది కాక ఏమనాలని అన్నారు.
గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను కవి•షన్ల కోసం కక్కుర్తిపడి పక్కదారి పట్టిస్తూ… గ్రామాలను పూర్తిగా నీరుగారుస్తున్నది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కేసీఆర్ చేతగానితనం వల్ల సర్పంచులు ఉన్న ఆస్తులు అమ్ముకుని అప్పులపాలై ఉపాధి కూలీలుగా, వాచ్‌మెన్లుగా, సెక్యూరిటీ ఉద్యోగులుగా కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతో వేల కోట్ల కవి•షన్లు దండుకుని తెలంగాణ రాష్టాన్ని్ర అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేయడం సిగ్గు చేటని పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హావి• పథకానికి కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా.. వాటిని నెలల తరబడి చెల్లించకుండా కూలీలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.