కార్తీక దీప మహోత్సవం

పరమ పవిత్త్రమైన దినం
హరిహరుల ప్రతుష్టి మాసం
దైవారాధనల శుభ తరుణం
కార్తీక పౌర్ణమి మహోత్సవం

ధ్వాదశి పౌర్ణమి వేళా
ప్రాతఃకాల స్నానాలు
నవ్య వస్త్రాధారణలు
త్రికరణశుద్ధిగా పూజలు

ఆకాశ దీపాల తేజస్సుతో
ప్రతి వదనం పరమ ప్రసన్నం
ప్రతి సదనం పవిత్ర ఆలయం

ఉత్క్రుష్ట గీతాలపనలు
ధ్యాన మంత్రోత్సరణలు
సహస్ర శివనామ స్తోత్రాలు
ఓం హరోం హర నాదాలతో
ప్రతి నిలయం ప్రతిధ్వనించు
ప్రతి మానసం ప్రతిస్పందించు

కేదారీశ్వరుని నోములు
అర్చనలు రుద్రాభిషేకాలు
నోములు ఉపవాస దీక్షలు
ధూపదీప నైవేద్ధ్యార్పణలతో
ప్రతి తలపు భక్తి పార్వసవ్యం
ప్రతి తనువు పులకితభరితం

ఈ శుభ మంగళకర వేళలో
ముక్కోటి దీపాలు వెలిగించి
పవిత్ర ఆలయాలు  దర్శించి
హరి హరాదుల ఆరాధించిన
ప్రతి మనో అభీష్టము సాకారం
ప్రతి భక్తజన్మ మోక్షం సంప్రాప్తం
( కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్బంగా..)
– కోడిగూటి తిరుపతి, 9573929493.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page