- కల్వకుంట్ల కుటుంబ డ్రామాలు ప్రజలు గుర్తించారు
- అందుకే రైతులు ఎక్కడా భాగస్వామ్యం కాలేదు
- సిఎం కెసిఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శ
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 13 : ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ దీక్షలు పెట్టారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. దీక్ష పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూశారని ఆరోపించారు. ఇప్పటికైనా టిఆర్‌ఎస్ రాజకీయ డ్రామాలకు తెరదించాలని, లేదంటే టీఆర్‌ఎస్ డ్రామాలకు ప్రజలే తెరదించుతారని అన్నారు. టీఆర్‌ఎస్‌వి రైతు దీక్షలు కాదని..రాజకీయ దీక్షలని విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ వి•డియాతో మాట్లాడుతూ…
కేసీఆర్ రాజకీయ నాటకమాడుతున్నారని, దిల్లీలో దీక్ష చేసి లబ్ది పొందాలనుకున్నారని, సీఎం డ్రామాలకు జనం తెరదించుతారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చాలా ముఖ్యమంత్రులు వ్యవహరించినట్లు సీఎం కేసీఆర్ వ్యవహరిస్తే హుందాగా ఉండేదని అన్నారు. రాజకీయంగా లబ్ది పొందేందుకే కేసీఆర్ ఇన్ని రోజులు డ్రామాలు చేశారని దుయ్యబట్టారు. దానిని రైతులు అర్థం చేసుకున్నారుని, అందుకే నిజమైన రైతు ఒక్కరూ భాగస్వాములు కాలేదని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం డ్రామాలు ఆపాలని.. లేకుంటే రైతులే వారి డ్రామాలకు తెరదింపుతారని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి డ్రామాలు చేస్తే..కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.
ఇదిలావుంటే ఆజాద్ కి అమృత్ మహోత్సవం సందర్భంగా దిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్ని రాష్ట్రాల పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు, సెక్రెటరీలతో, అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆజాద్ కి అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కల్చరల్ మినిస్టీ తరఫున దేశ వ్యాప్తంగా ఆజాద్ కి అమృత మహోత్సవ కార్యక్రమాలు జరుపుతున్నామని చెప్పారు. స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్రను ఇప్పుడున్న తరానికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. టీవీల షోలో సీరియల్ ద్వారా వివిధ సోషల్ విడియాలో వారి జీవితాల గురించి వీడియోలను తీస్తున్నామని చెప్పారు.
జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో, 75 చోట్ల యోగా కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆగస్టు 15న దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలిపునిచ్చారు. ప్రతి ఇంటి వి•ద భారతీయ జెండా, కుటుంబ సమేతంగా జాతీయ గీతం పాడాలని తెలిపారు. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రతి రాష్ట్రం, అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ప్రపంచ దేశాలను అబ్బుర పరిచేలా ఈ కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ఇప్పటివరకు దేశానికి 14 మంది ప్రధానమంత్రులు అయ్యారని, 14 మంది ప్రధాన మంత్రుల పేరుతో తీన్మూర్తి భవన్‌లో ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం ఏర్పాటు చేశామని చెప్పారు. గురువారం ప్రధానమంత్రి చేతుల వి•దుగా జాతికి అంకితం చేస్తామని తెలిపారు.