నేడు గణేష్ శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. దిగువ మ్యాప్‌లో చూపిన విధంగా శోభాయాత్ర మార్గం లో కొనసాగుతుంది మరియు ఆ మార్గంలో ట్రాఫిక్ దాటడానికి అనుమతించబడదు అని నగర పోలీసు కమిషనర్ సీ వీ ఆనంద్ ట్వీట్ చేసారు. ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రతి ఒక్కరూ ఇంటి లోపలే ఉండవలసిందిగా నేను కోరుతున్నాను అని పేర్కొంటూ అన్ని తెలుగు ఛానెల్‌లలో నిమజ్జనం కార్యక్రమాలను ఎల్లప్పుడూ ప్రత్యక్షంగా చూడవచ్చు అని సూచించారు. రోడ్లు గణేష్ నిమజ్జనం ఊరేగింపుదారులతో కిక్కిరిసిపోయి నిండిపోతాయి.. ఊరేగింపుదారులందరూ నిమజ్జనాన్ని శాంతియుతంగా చేయాలని కూడా కమిషనర్ అభ్యర్థించారు.