Take a fresh look at your lifestyle.

ఇం‌టర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌ ‌విడుదల

మార్చి 15వ తేద నుంచి పరీక్షలు….ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రాక్టికల్స్
‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ఇం‌టర్మీడియట్‌ ‌వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్‌ ‌బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 15వ తేద నుంచి ఇంటర్‌ ‌మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి మొదలవుతాయి.ఉదయం 9 నుంచి 12 వరకు పరీక్షలు జరుగుతాయి.

ప్రాక్టికల్‌ ‌పరీక్షలు మాత్రం ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. రెండు విడుతలుగా అంటే ఉదయం 9 నుంచి 12 వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతాయి. ఏప్రిల్‌ 3‌వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్‌ ‌పరీక్షల  టైంటేబుల్‌ ‌ను ఇంటర్‌ ‌బోర్డు రిలీజ్‌ ‌చేసింది.

Leave a Reply