తిరంగా ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
పాక్, పీవోకేలోని టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేసిన సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్‌కు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా తిరంగా విజయ యాత్ర చేపట్టాని బీజేపీ పిలుపునిచ్చింది. హై కమాండ్ పిలుపు మేరకు తెలంగాణ బీజేపీ యూనిట్ శనివారం హైదరాబాద్‌లో తిరంగా యాత్ర చేపట్టింది. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి స్వావి• వివేకానంద విగ్రహం వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీకి హాజరైన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. మనది శాంతి కోరుకునే దేశమని.. భారత్ ఎప్పుడూ ఏ దేశం వి•ద ముందుగా దాడి చేయలేదని అన్నారు. పాక్‌తో ఉద్రిక్తతల వేళ ప్రధాని మోడీ ప్రదర్శించిన సమయస్పూర్తిని మెచ్చుకోవాలన్నారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లితే ప్రజలు కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా ఉండాలని కోరారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ’ఆపరేషన్ సిందూర్’
విజయాన్ని పురస్కరించుకొని, మన దేశ సైనికులకు సంఘీభావంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ రోడ్డులో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ’తిరంగా ర్యాలీ’.. సచివాలయం జంక్షన్ వి•దుగా సైనిక ట్యాంక్ వరకు కొనసాగింది.