గోదావరి వద్ద మంత్రి తుమ్మల పూజలు
అధికారులు, ఇంజనీర్లకు మంత్రి అభినందనలు
ఖమ్మం,ప్రజాతంత్ర,జూన్27:ఉమ్
ఉమ్మడి ఖమ్మంలోని సుమారు పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ఉద్దేశించి అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్ట్‌ను మంత్రి తుమ్మల లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు దాదాపు పూరత్య్యింది. దీనికి సంబంధించిన ట్రయల్ రన్‌ను గురువారం చేపట్టారు. మొదటి పంపు నుంచి గోదావరి నీళ్లు ఎగసి పడుతుంటే మంత్రులు, ప్రజాప్రతినిధులు సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భూమాతకు ప్రణమిళ్లారు. ఎన్నో ఏళ్ల ప్రజల కల నెరవేరే సమయం ఆసన్నమైందన్న మంత్రులు వీలైనంత త్వరగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. తన చివరి కోరిక ఖమ్మం జిల్లా ప్రజలకు గోదావరి జలాలు అందివ్వడమేనని అది నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
ప్రాజెక్టులో భాగమైన ఇంజనీర్లకు, భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. 2004 కంటే ముందే దీనికి ప్రతిపాదనలు సిద్ధమైన రూపుదాల్చలేదు. 2016 ఫిబ్రవరి 16న కేసీఆర్ సీఎం హోదాలో శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ హయాంలో పనులు పూర్తి అయ్యాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో 17 వేల కోట్ల అంచనాతో ప్రతిష్టాత్మకం గా సీతారామ ప్రాజెక్టు చేపట్టారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ట్రయల్‌రన్‌లో పాల్గొని అధికారులతో కలసి పంప్ హౌస్ మోటార్ల పనితీరును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.పంప్‌హౌస్ వద్ద గోదావరికి మంత్రి పూజలు చేశారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులను అభింనందించారు. ఈ ప్రాజెక్ట్‌తో ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనున్నది.




