అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్ధిక సాయం
•ఆడపిల్లల చదువులకు ప్రోత్సాహం కలిగించేలా పథకం
•పేదలకు పెళ్లిల్లు భారం కాకుండా అమలు చేస్తున్నాం
•పథకం అమలుపై సిఎం జగన్ వివరణ
అమరావతి, అగస్ట్9: వైఎస్‌ఆర్ కల్యాణ మస్తు, వైఎస్‌ఆర్ షాదీ తోఫా. ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18, 883 జంటలకు రూ.141. 60 కోట్ల ఆర్ధికసాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో సీఎం వైయస్.జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆడపిల్లల చదువులను ప్రోత్సహిస్తూ…దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్ర మానికి ఇక్కడ నుంచే శ్రీకారం చుడుతున్నా మన్నారు.వైఎస్‌ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్‌ఆర్ షాదీతోఫా అనే ఈ రెండు కార్యక్రమాలు చదువులను మరింత ప్రోత్సహిస్తూ.. ఆడ పిల్లలు గొప్పగా చదివేటట్టు ప్రోత్సహిస్తూ.. ఆ కుటుంబాలకు ఆర్ధికంగా అండగా నిలిచే మంచి కార్యక్రమాలని అన్నారు. పేదరి కంలో ఉన్న నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నా దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లల కోసమే ఈ పథకం ప్రవేశ పెట్టామని అన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, అప్పులు పాలయ్యే పరిస్థితి లేకుండా, రాకుండా పెళ్లిళ్లు జరిగే పరిస్థితి రావాలని ఆ పిల్లలు బాగా చదివి ప్రతి ఒక్కరూ డిగ్రీవరకు వెళ్లే పరిస్థితి రావాలన్న తలంపుతో ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. 18,883 జంటలకు రూ.141 కోట్ల ఆర్ధిక సహాయం. ఈ ఏడాది ఏఫ్రిల్, మే, జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి పెళ్లిళ్లు అయిన వారితో పాటు 2023 జనవరి నుంచి మార్చి వరకు వివాహాలు అయి వారిలో కూడా ఏ కారణంగానైనా సర్టిఫికెట్ సకాలంలో సమర్పించలేకపోవడం,అధికారులు తనిఖీకు వచ్చి నప్పుడు ఆ సమ యంలో లేకపో వడం వంటి రకరకాల కారణాలతో.. ఆ పీరి యడ్‌లో రానివారుంటే, అలా మిగిలిపోయిన వారిని కూడా ఇందులో కలిపి ఇవాళ ఈ సహాయం చేస్తున్నాం. మొత్తంగా 18,883 జంటలకు సంబంధించి ఈ రోజు రూ.141 కోట్ల ఆర్ధిక సహాయం తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం.గతేడాది అక్టోబరు నుంచి ఈ యేడాది మార్చి వరకు రెండు విడతల్లో ఈ పథకాన్ని అమలు చేసాం. ఈ మూడు విడతల్లో రూ.267 కోట్లు…. పిల్లల చదు వులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేశాం.ఈ కార్యక్రమంలో ఇప్పటికే 35,551 జంటలకు మేలు జరుగుతుంది. ప్రతి ఏడాది మూడునెలలకొకమారు చొప్పున నాలుగు విడతల్లో కళ్యాణమస్తు కార్యక్రమం జరుగుతుంది. 86శాతం మంది డిగ్రీ అమ్మాయిలే…ఇవాళ ఇచ్చే 18,883 మంది పిల్లలకు సంబంధించిన విషయాలను గమనిస్తే… కొన్ని మనసుకు సంతోషాన్నిచ్చే విషయాలు కనిపిస్తాయి. ఇందులో 18 నుంచి 21 సంవత్సరాల వయస్సులో ఉన్న అమ్మాయిల వివరాల లెక్క చూస్తే.. 8,524 మంది చెల్లెమ్మలు ఉన్నారు.
ఇందులో అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన వీటన్నింటి వల్లా లబ్ది పొంది డిగ్రీ కూడా చదివిన, చదువుతున్న వారు 7,344 మంది ఉన్నారు. అంటే 8,524 మంది చెల్లెమ్మల్లో డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కోర్సు లును 86 శాతం మంది చదువుతున్నారు. పదోతరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి, ఆ తర్వాత డిగ్రీలో విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మేలు పొందారు. అంటే పెళ్లిళ్లు చేసుకోవాలన్న ఆలోచన పక్కనపెట్టి, చదువుద ధ్యాసపెట్టి డిగ్రీలు పూర్తి చేసుకుని, చదువులు పూర్తి చేసుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు 86 శాతం మంది ఉన్నారు. నిజంగా మనం అనుకున్న లక్ష్యం, ఏం సాధించాలని మనం తాపత్రయపడ్డామో అది ఈ లెక్కలు చూసినప్పుడు మనకు అర్ధం అవుతుందని జగన్ అన్నారు.మనం పెడు తున్న ఈ నమ్మకం వల్ల… పేద సామాజిక వర్గాల్లో పిల్లలు గొప్పగా చదివే పరిస్థితి రావాలి. ప్రతి ఒక్కరికీ కనీసం డిగ్రీవరకు చదివి.. ఆ సర్టిఫికేట్ చేతిలో ఉండే పరిస్థితి రావాలన్నారు. పేదరికం నుంచి బయటకు రావాలంటే చదువు అనే బ్రహ్మాస్త్రం ఉండాలని ఆరాటపడుతున్న ప్రభుత్వం మనది. గతంలో కేవలం ఎన్నికలే లక్ష్యంగా పథకాలు తెచ్చారు. రూపాయి ఖర్చు లేకుండా చదివిస్తూ… కానీ ఈ రోజు అలా చేయకుండా.. పదోతరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధనను తీసుకొస్తున్నాం. పదోతరగతి పాస్ అయ్యేలా తల్లిదండ్రులు ప్రోత్సహించేటట్టు అడుగులు వేస్తున్నా మన్నారు. నా చెల్లెమ్మలకు 18, తమ్ముళ్లకు 21 సంవత్సరాల వయసు ఉండాలనే నిబంధన తీసుకొచ్చాం. దీనివల్ల చెల్లెమ్మలు పదోతరగతి వరకు కచ్చితంగా చదువుతారు.
అమ్మఒడి అనే పథకం అందుబాటులో ఉంది కాబట్టి…. చదువు కొనసాగిస్తూ ఇంటర్ డియట్‌కు వెళ్తారు. తద్వారా ఇంటర్‌లో కూడా అమ్మఒడి డబ్బులు వస్తాయన్నది ఒక ప్రోత్సాహం కాగా…ఇంటర్ పూర్తి చేస్తారన్నది రెండో అంశం. దానితర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ – విద్యా దీవెన, వసతి దీవెన అనే రెండు పథకాల తోనూ డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులున్నీ రూపాయి ఖర్చు లేకుండా.. పూర్తిగా ప్రభుత్వం భరిస్తూ తోడుగా నిలబడుతుంది.అంతే కాకుండా పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ.. ప్రతి పాప, పిల్లవాడికి కూడా డిగ్రీలో చేరితే చాలు… వసతి దీవెన అనేపథకం ద్వారా రూ.20 వేలు వాళ్ల బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం రెండు దఫాల్లో పిల్లల తల్లుల ఖాతాల్లో వేస్తున్నాం. ఒక్కో అమ్మాయి, పిల్లవాడి ద వాళ్ల డిగ్రీలు పూర్తి చేసేం దుకు సంవత్సరానికి మరో రూ.60వేలు ఒక్కొక్కరికి ఇచ్చినట్టవుతుంది. అప్పటికి ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, అబ్బా యిలకు 21 సంవత్సరాలు నిండుతాయి. 21 ఏళ్ల తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటే…ఆ తర్వాత పెళ్లిళ్లు చేసినట్లయితే… మైనార్టీలకు గతంలో రూ.50వేలు మాత్రమే ప్రోత్స హకంగా ఇస్తామని ప్రకటించి, ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి ఇప్పుడు షాదీతోఫా కింద ఏకంగా రూ.1లక్ష ఇచ్చి పెళ్లికి తోడుగా నిలబడే కార్యక్రమం జరుగు తుంది. వికలాంగులకు గత ప్రభుత్వంలో రూ.1లక్ష ఇస్తామని ప్రకటించి ఎగ్గొట్టారు .ఇప్పుడు మనం వారికి ఏకంగా రూ.1.50 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. భవన నిర్మాణకార్మికులు గత ప్రభుత్వంలో రూ. 20వేలు ప్రకటించి ఇవ్వకుండా వదిలేస్తే… మనం ఈరోజు రూ.40వేలు ఇచ్చి ప్రోత్స హిస్తున్నాం. ఎస్సీలకు గతంలో రూ.40 వేలు ప్రకటించి ఇవ్వకుండా వదిలేస్తే.. మన ప్రభుత్వంలో రూ.1లక్ష ఇచ్చిందన్నారు.
హిస్తు న్నాం.
ఎస్టీలకైతే గతంలో రూ.50వేలు ఇస్తామని ఎగ్గొడితే.. మన ప్రభుత్వంలో రూ.1లక్ష ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం.ఇక బీసీలకైతే గతంలో రూ.30 వేలు ఇస్తామని ఎగ్గొడితే.. మనం ఏకంగా రూ.50వేలు ఇచ్చి వాళ్లను కూడా ప్రోత్సహించి నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. కులాంతర వివాహాలకు అయితే ఇంకా ఎక్కువ ఇచ్చి మనసు పెట్టి ప్రోత్సాహిస్తున్నాం. పేద పిల్లలు అప్పులు పాలు కాకూడదని..ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ మనసుపెట్టి ప్రతి పాప, పిల్లవాడు
పేదరికం నుంచి బయటపడాలంటే కచ్చింగా చదువు ఒక్కటే మార్గమని… ఆ చదువుకునేదానికి ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని ప్రతి ఒక్కరినీ చదవించే కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఏ ఒక్కరూ మిగిలిపోకూడదన్న తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం.ఒకవేళ పొరపాటున ఎవరైనా, ఎక్కడైనా మిగిలిపోతే… వారిని కచ్చితంగా మరలా మూడు నెలలకిచ్చే కార్యక్రమంలో భాగంగా వాళ్ల దగ్గర నుంచి లోపాలను సరిదిద్ది.. తర్వాత దఫాలో వారిని యాడ్ చేయించే కార్యక్రమం చేస్తున్నాం.ఇందులో భాగాంగానే గతంలో మనం ఈ కార్యక్రమాన్ని ప్రకటించినప్పుడు..ప్రతి అడుగులోనూ మానవత్వంతో..దూదేకుల, నూర్ భాషాలకు సంబంధించిన మైనార్టీ సోదరులకు రూ.50వేలు వస్తుందని చెపితే.. వాళ్లు కూడా మైనార్టీలే కదా అని… దాన్ని కూడా సానుకూలంగా పరిగణలోకి తీసుకుని వాళ్లకు కూడా రూ.1లక్ష పెంచే కార్యక్రమం చేశాం. గతంలో రూ.1లక్ష రాని 227 జంటలకు అది కూడా ఇస్తున్నాం.
ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్న ప్రతి చెల్లెమ్మకూ, తమ్ముడుకూ, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చివరిగా..ఈ కార్యక్రమంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత… ప్రతిమండలంలో ఒక హైస్కూల్‌ను ప్రత్యేకంగా బాలికల జూనియర్ కాలేజీగా మార్పు చేసి తీసుకొచ్చాం. ప్రతి మండలంలోనూ రెండు జూనియర్ కాలేజీలు ఉండేటట్టుగా… అడుగులు వేగంగా వేస్తున్నాం. ఇందులో ఒకటి కో ఎడ్యుకేషన్ కాలేజీ కాగా, మరొకటి ప్రత్యేక బాలికల జూనియర్ కళాశాల. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఈ రకమైన ఏర్పాటు చేస్తున్నాం.అదే విధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం కూడా ఎక్కడకో వెళ్లి చాలా కష్టపడాల్సిన పరిస్థితి నుంచి..కేవలం గ్రామ సచివాలయంలో దరఖాస్తు పెడితే 30 రోజులలోగా వెరిఫికేషన్ చేసి అక్కడే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చే గొప్ప మార్పు చేయగలిగాం. రు కూడా ఇంకా ఓరియెంటేషన్ చేయడానికి చొరవ తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని సీఎం జగన్ అన్నారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, విద్యుత్, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మెరుగు నాగార్జున, మహిళా,శిశుసంక్షేమశాఖ మంత్రి కె వి ఉషశ్రీచరణ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి జి జయలక్ష్మి, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కె విజయ ఇతర ఉన్నతాధికారులు హాజరు.




