వార్తల్లో మరోసారి వరంగల్‌..

‌వరంగల్‌ అం‌టేనే చైతన్యంగల జిల్లాగా మొదటినుండీ పేరుంది. రాజకీయ పార్టీలేవైనా తమ ప్రస్థానాన్ని వరంగల్‌తో ముడిపెట్టకుండా ఉండవన్నది చారత్రిక సత్యం. స్వాతంత్య్ర పోరాటం మొదలు నిజామ్‌ ‌ముష్కరులను పారదోలే విషయంలో నాటి ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తొలి, మలివిడుత తెలంగాణ ఉద్యమానికి వరంగల్‌ ఒక ప్రతీక. పద్నాలుగేళ్ళ మలివిడుత తెలంగాణ పోరాటాల కాలంలో ఉద్యమం చల్లబడుతుందంటే దాన్ని మళ్ళీ ఉధృత•స్థాయికి తీసుకురావడంలో ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా ప్రధాన పాత్ర వహించింది. నాటి ఉద్యమనాయకుడిగా కెసిఆర్‌ ‌తన కండబలాన్ని పరీక్షించుకోవాలనుకున్నప్పుడల్లా వరంగల్‌లో సభపెట్టేవాడు. ఇక్కడ సభ సక్సెస్‌ అయిందంటే ప్రజలు తన వెంటే ఉన్నారన్న అభిప్రాయంగా ఉండేవారని ఆనాటి ఉద్యమనాయకులు అనుకునేవారు. అయితే ఇక్కడి ప్రజల మనోభావాలకు ఇబ్బందికరంగా ఉన్నవారిని వ్యతిరేకించడంలోకూడా అదే తెగువను చూపుతారనడానికి కొన్ని మరిచిపోని సంఘటనలే నిదర్శనం. వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ ‌షర్మిల తెలంగాణలో సుమారు మూడువేల అయిదు వందల కిలోమీటర్లమేర పాదయాత్ర నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో పర్యటించిన షర్మిలకు ఇంతవరకు ఏ జిల్లాలోనూ వ్యతిరేకత ఎదురు కాలేదు.

దీంతో అమెలో మరింత స్థైర్యం పెరిగింది. పాదయాత్రల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రులు, ఎంఎల్‌ఏలు ఎవరినైనా సరే అమె కడిగి పారేస్తూ వొచ్చింది. వారి అవినీతి, అక్రమాలు, భూకుంభకోణాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడంలో జరుగుతున్న వివక్ష తదితర అంశాలను అమె తన ప్రచారాస్త్రాలుగా సంధిస్తూ వొస్తున్నది. తాజాగా అమె ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో మాత్రం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వొచ్చింది. నర్సంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా అమె అక్కడి ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వొచ్చింది. స్థానిక శాసనసభ్యుడు పెద్ధి సుదర్శన్‌రెడ్డిపైన అమె అనుచిత వ్యాఖ్యలు చేసిందన్నది ఇక్కడ ప్రధాన అభియోగం.

ఆ కారణంగా ఇక్కడ ఒక విధంగా ఓ యుద్ధవాతావరణం ఏర్పడిందనే చెప్పాలె. వైఎస్‌ఆర్‌టిపార్టీ కార్యకర్తలు, టిఆర్‌ఎస్‌ ‌శ్రేణుల మధ్య తోపులాటలు, దాడులు జరిగాయి. ఆమె కాన్వాయ్‌పైన భౌతికదాడులకు పాల్పడ్డారన్నది వైఎస్‌ఆర్‌తెలంగాణ పార్టీ శ్రేణుల అభియోగం. అంతేకాదు వాహనాలను ధ్వంసం చేసి, దగ్ధం చేశారన్నది వారి ఆరోపణ. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకుని షర్మిలను అరెస్టు చేయడం, అమె ట్రాఫిక్‌ ‌కు అంతరాయం కలిగించారంటూ కేసులు నమోదుచేయడం, అమె తల్లి విజయమ్మను హౌస్‌ అరెస్టు చేయడం, దానికి అమె ఇంట్లోనే నిరాహార దీక్ష చేపట్టడం ఇప్పుడు కేవలం తెలంగాణలోనేకాదు, పక్కనున్న ఏపిలో కూడా ఈ సంఘటన పెద్ద సంచలనాత్మకమైంది. ఒక ఆడకూతురుగా, ప్రతిపక్ష పార్టీ నేతగా తాము షర్మిలను గౌరవిస్తామేగాని, తమ నాయకుడిపట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునేదిలేదని నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళలు షర్మిలపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. కాగా గతాన్ని ఒకసారి పరిశీలిస్తే షర్మిల సోదరుడు, నేటి ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి డా. వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత ఆయన అభిమానులు కొందరు ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా ఆయా కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర పేరున ఏపితోపాటు తెలంగాణ జిల్లాలో పర్యటించే క్రమంలో ఇలాగే వ్యతిరేకత ఎదురైంది.

ఇక్కడ వొచ్చిన వ్యతిరేకతకారణంగా ఆయన తన పర్యటనను విరమించుకోవాల్సి వొచ్చింది. నాటి ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్‌ ‌వేదికగా జరిగిన ఈ ఘటన యావత్‌ ‌దేశందృష్టిని ఆకర్షించిన విషయం తెలియందికాదు. తెలంగాణ పోరాటచరిత్రలో ఆదోమరపురాని ఘట్టం. ఉమ్మడి ఏపి చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి చుక్కలు చూపించిన ఘటన అయితేనేమీ, ఉద్యమకాలంలో తెలుగుదేశం పార్టీ నేతలు వరంగల్‌లో పర్యటించినప్పుడైతేనేమీ, కొత్తగా ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన ప్రముఖ సినీయాక్టర్‌ ‌చిరంజీవి జిల్లాలో పర్యటించినప్పుడైతే•నేమీ ఇతర ప్రాంతాలతో పోల్చినప్పుడు ఇక్కడి ప్రజలనుండి వారు వ్యతిరేకతను ఎదుర్కోక తప్పలేదు. చిరంజీవిని వ్యతిరేకించిన సంఘటన కూడా నర్సంపేటలోనే కావడం విశేషం. ఇది 2008లో జరిగింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా వరంగల్‌లో పర్యటించినప్పుడు ఇప్పుడు షర్మిల లాగానే నాడు కవితపై చేసిన విమర్శలకు ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఇవ్వాళ షర్మిలను అరెస్టు చేసినట్లు ఆనాడు బండి సంజయ్‌ని కూడా పోలీసులు అరెస్టుచేశారు. తాజాగా అయిదవ ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బండి సంజయ్‌ అదే తీరున అరెస్టు అయ్యారు. చివరకు కోర్టు అనుమతితో ఆయన మంగళవారం నుండి పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు వరంగల్‌ అం‌టేనే ఒక చైతన్యం. కాకలు తీరిన కాకతీయుల వారసులుగా ఇక్కడి ప్రజల్లో అది కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. అయితే షర్మిల సంఘటనలో వాస్తవాలేమిటన్నది వెలుగుచూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *