రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు భారీ వర్షాలు

వాతావరణ శాఖ వెల్లడి
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : : ‌రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని చెప్పింది.

ఉమ్మడి ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, జయశంకర్‌, ‌ములుగు, భదాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, ‌కరీంనగర్‌, ‌నిజామాబాద్‌, ‌భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *