ఆర్థిక, విద్యుత్ శాఖలు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు
ఉత్తమ్‌కు నీటిపారుదల, సీఏడీ, ఫుడ్ అండ్ సివిల్ సప్లై శాఖలు
ఐటి, శాసనసభా వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి` రెవన్యూ, హౌసింగ్, సమాచార శాఖలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : ఎట్టకేలకు శనివారం రాష్ట్ర మంత్రులకు శాఖలను కేటాయించారు. డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖను కేటాయించారు. అలాగే ఐటి, సభా వ్వయహారాలను శ్రీధర్ బాబుకు కేటాయించారు. దిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించిన సిఎం రేవంత్ కొత్తగా ప్రమాణం చేసిన 11 మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. ఆయా మంత్రులకు శాఖలు కేటాయించినట్టు రాజ్‌భవన్‌కు సందేశం సీఎం కార్యాలయం పంపించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి వద్దే హోమ్ శాఖతోపాటు ఇతర కీలకమైన శాఖలు ఉండబోతున్నాయి. మిగతా మంత్రుల ఖాళీలు భర్తీ అయ్యేంత వరకు ఆ శాఖలు ఆయన చూస్తారు. ఆయన వద్ద మునిసిపల్ అడ్మినిస్టేష్రన్ ,అర్బన్ డెవలప్‌మెంట్, జనరల్ అడ్మినిస్టేష్రన్, లా అండ్ ఆర్డర్, కేటాయించని విద్య ఇతర శాఖలు కూడా ఉన్నాయి.
డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు కీలకమైన శాఖలు కేటాయించారు. ఆర్థిక శాఖతోపాటు విద్యుత్ శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు. మిగతా మంత్రులకు కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ` నీటిపారుదల, సీఏడీ, ఫుడ్ అండ్ సివిల్ సప్లై, దామోదర్ రాజనర్సింహా` వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి` రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు` ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీస్, కామర్స్, లెజిస్లేటివ్ అఫైర్స్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి` రెవన్యూ, హౌసింగ్, సమాచార శాఖలను కేటాయించారు. పొన్నం ప్రభాకర్` రవాణా, బీసీ వెల్ఫేర్ శాఖ, కొండా సురేఖ` ఎన్విరాన్‌మెంట్, అటవీశాఖ, దేవాదాయ శాఖలను, అనసూయ సీతక్క ` పంచాయతీ రాజ్, గ్రావిూణాభివృద్ధి, స్త్రీశిశుసంక్షేమ శాఖలను,తుమ్మల నాగేశ్వరరావు` వ్యవసాయ శాఖ, చేనేత శాఖ, మార్కెటింగ్ కోఆపరేషన్, జూపల్లి కృష్ణారావు` ఎక్సైజ్ శాఖ, పర్యాటక సాంస్కృతిక శాఖలను కేటాయించారు.



