శనివారం సాయంత్రానికి 41 అడుగులు….మరింత పెరిగే అవకాశం
భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 22 : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం తగ్గినట్టు కనిపించినా సాయంత్రం నుంచి మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. మధ్యాహ్నానానికి 39.7 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 41 అడుగులకు పెరిగింది. ఇది క్రమంగా ఆదివారానికి ఇంకాస్త పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో ప్రాణహిత, ఇంద్రావతి, కాళేశ్వరం డ్యామ్‌లను వరదనీరు ఎక్కువగా ఉండటం వలన దిగువ ప్రాంతానికి విడుదల చేసే అవకాశం ఉంది. దీని కారణంగా క్రమంగా పెరుగుతూ మళ్ళీ 43 అడుగులు చేరుకునే అవకాశం ఉంది.




