ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అధినేతగా, తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ప్రజల అభిమానం చూరగొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి పరోక్షంగా కేసీఆరే అహంకారమే కారణంగా చెప్పుకోవాలి. కుమార్తె పెళ్లి సందర్భంగా రేవంత్ రెడ్డిని బయటకు రాకుండా చేయాలని చూసినా.. బెయిల్‌పై బయటకు వొచ్చి మళ్లీ వెంటనే జైలుకు వెళ్ళవలసి వొచ్చింది. ఈ సంఘటన రేవంత్ రెడ్డి జీవితంలో మరచిపోలేనిదని చెప్పాలి. ఇది రేవంత్‌కు జరిగిన అవమానం. ఇలా తెలంగాణ ఉద్యమకారులు ప్రొఫెసర్ కోదండరామ్ తదితర వేలాదిమందికి ఎన్నో రకాలు గా అవమానాలు జరిగాయి. ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి కూడా మరో తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం చేశారు. అందుకే ప్రజలు ఆయనను ఆదరించి చేరదీసి అధికారం కట్ట బెట్టారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరవాత శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న తీరు అభినందనీయం. సిఎం రేవంత్ రెడ్డి ,మంత్రులు సవిూక్షలు చేస్తూ త్వరితగతిన ఇచ్చిన హావిూల మేరకు ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రజలకు చేరువగా అవుతున్న తీరు కూడా అభినందనీయం. ప్రజల్లో కూడా రేవంత్ నాయకత్వంపై విశ్వాసం ఏర్పడిరది. ఏదైనా చేయగలరన్న భరోసా కలిగింది. గతంలో కెసిఆర్ ఎవరినీ దరిచేరనీయలేదు అన్న అభియోగమున్నది. లెక్కలు తీసేవరకు ఆగకుండా రైతుబంధును ముందుగా విడుదలకు ఆదేశించారు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్నట్లుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టబోతున్నారు. నియామకాలు, ఖాలీల వివరాలతో రావాలని టిపి పిఎస్సీ ఛైర్మన్‌ను ఆదేశించారు. దీంతో దెబ్బకు ఆయన రాజీనామా చేశారు. అలాగే అనేకమంది సలహాదారులను, కార్పోరేషన్ ఛైర్మన్లను తొలగించారు. మొత్తంగా నిరుద్యోగులకు కూడా భరోసా ఏర్పడిరది. సిఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో చిత్తశుద్దితోనే ఉన్నట్లుగా ఉంది. మరోవైపు మంత్రులు కూడా సవిూక్షలు చేస్తున్నారు. కాళేశ్వరం అవకతవకల పై ఉత్తమ్ కుమార్ రెడ్డి సవిూక్షించారు. సవిూక్షలు ఒకవైపు చేస్తూనే ప్రజలకు సమాచారం చేరవేస్తున్నారు.
దిల్లీలో గత పదేళ్లుగా తెలంగాణ భవన్ పంచాయితీ తెంచలేదు. దానిని పునర్నిర్మించే పని గురించి ఆలోచించ లేదు. ఇప్పుడా పనికి కూడా మంత్రి కోమటిరెడ్డి పూనుకున్నారు. ఇలా ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే చురుకుగా పనులు సాగుతున్నాయి. కెసిఆర్ అధికారంలో ఉండగా ఏం జరుగుతుందో ఎవరికీ తెలిసేది కాదు. ప్రజలకు సమాచారం చేరవేసేది కాదు. కెసిఆర్ ఎవరినీ దరిచేయనీయకుండా చూసుకున్నారు. తన కోటరీతో కాలక్షేపం చేశారు. ప్రజలతో సంబంధం లేకుండా పదేళ్లు అధికార పెత్తనం చెలాయించారు. తాను చేసిందే పనిగా తలచి ప్రజలపై రుద్దారు. కాళేశ్వరం లాంటి పథకాలతో అప్పులకుప్పను చేశారు. సంపద పెంచానని బొంకుతూ..ఐదులలక్షల కోట్లు అప్పుల్లో పెట్టారు.నిరంతర విద్యుత్ ఇస్తున్నానని చెప్పి.. ప్రజలను మభ్య పెట్టి 85వేల కోట్ల అప్పులను చేశారు. ఇవన్నీ ఏనాడు బయటకు రాలేదు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తరవాత వారం రోజుల్లోనే తేడా కనిపిస్తోంది. అందుకే రాజకీయాలలో అహంకారంతో పనిచేస్తే వారి జాతకాలను ప్రజలే మార్చివేస్తారని రుజువు అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఇంతగా అహంకారం జీర్ణించుకుంటారని ప్రజలు ఊహించి వుండరు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో రెండవ పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన మంత్రివర్గంలోకి కేసీఆర్‌ను తీసుకోకుండా పక్కనపెట్టడంతో కసితో కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తలకెత్తుకున్నారు. తెలంగాణ ప్రజల్లో ఉన్న సెంటిమెంటును తనకు అనుకూలంగా మార్చుకుని గద్దెను ఎక్కారు. ప్రజలు కూడా కెసిఆర్‌ను నమ్మారు. చంద్రబాబు తన మంత్రివర్గంలోకి కెసిఆర్‌ను తీసుకుని ఉంటే తెలంగాణ ఉద్యమానికి అవకాశం ఏర్పడి ఉండేది కాదేమో..! ఇకపోతే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

పదిమంది ఎమ్మెల్యేలను తీసుకుంటే మాదే ప్రభుత్వం అని క్షేత్రస్థాయిలో బిఆర్ఎస్ నేతలు విర్రవీగుతున్నారు. ఇలాంటి ప్రచారాలపై రేవంత్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ఇదే విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా బహిరంగంగానే వెలిబుచ్చారు. గతంలో ఎమ్మెల్యేలను గంపగుత్తగా కొన్న అనుభవం కెసిఆర్కుంది. అందువల్ల ఇలాంటి ప్రయత్నాలను పసిగట్టి ముందుకు సాగాలి. ప్రత్యేక తెలంగాణ లో రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యబద్దంగా ముందుకు సాగుతున్నారు. ప్రజలు కూడా ఈ విషయంలో నిశ్చింతంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అధినేతగా, తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ప్రజల అభిమానం చూరగొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి పరోక్షంగా కేసీఆరే అహంకారమే కారణంగా చెప్పుకోవాలి. కుమార్తె పెళ్లి సందర్భంగా రేవంత్ రెడ్డిని బయటకు రాకుండా చేయాలని చూసినా.. బెయిల్‌పై బయటకు వొచ్చి మళ్లీ వెంటనే జైలుకు వెళ్ళవలసి వొచ్చింది. ఈ సంఘటన రేవంత్ రెడ్డి జీవితంలో మరచిపోలేనిదని చెప్పాలి. ఇది రేవంత్‌కు జరిగిన అవమానం. ఇలా తెలంగాణ ఉద్యమకారులు ప్రొఫెసర్ కోదండరామ్ తదితర వేలాదిమందికి ఎన్నో రకాలు గా అవమానాలు జరిగాయి.
ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కూడా మరో తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం చేశారు. అందుకే ప్రజలు ఆయనను ఆదరించి చేరదీసి అధికారం కట్ట బెట్టారు. బిఆర్ఎస్, బిజెపిల కుటిల రాజకీయాలరు కూడా ప్రజలు గుర్తించి, కాంగ్రెస్ పార్టీని గుర్తించి ఆదరించారు. రేవంత్ రెడ్డి నాయకత్వానికి ప్రజలు జై కొట్టారు. రేవంత్ రెడ్డి కూడా కెసిఆర్ లాగా కాకుండా అధికారంలోకి రాగేనే ప్రజాభవన్ ప్రారంభించారు. దానిముందున్న ఇనుప కంచెను తొలగించారు. ప్రజల వినతులు స్వీకరించి పరిష్కరించే కార్యక్రమం మొదలు పెట్టారు. ఆర్థిక పరిస్థితిపై లోతుగా అధ్యయనం మొదలు పెట్టారు. గత పదేళ్లుగా ఎక్కడైతే అవినీతి, అక్రమాలు జరిగాయో అక్కడి నుంచే పాలన మొదలు పెట్టడం శుభసూచకం. అందుకే ఒక్కో అంశాన్ని, పథకాన్ని సవిూక్షించి ముందుకు సాగాల్సిన బాధ్యత ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డిపై ఉంది. రైతుబంధులో అవినీతిని ఆపి, అడ్డగోలు చెల్లింపులకు చెక్ పెట్టాలి. కిలో రూపాయి బియ్యంపై సవిూక్షించాలి. తెల్లరేషన్ కార్డులను అర్హులైన పేదలకే అందించాలి. ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఆధునీకరించాలి. హడావిడిగా ప్రచారం చేసిన వైద్యరంగంపై నిజానిజాలు వెలికితీయాలి. ప్రభుత్వ హాస్పిటల్స్ బలోపేతం అయితే ఆరోగ్యశ్రీల అవసరం ఉండదు. విద్యా రంగాన్ని కూడా పటిష్టం చేయాలి. కెజి టూ పిజి ఉచిత విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. కులాలు, మతాల వారిగా విద్యను చెప్పే విధానాలకు తిలోదకాలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో కులాల ప్రభావం పెరిగి సమాజంలో విచ్ఛిన్నకర ధోరణుల ప్రబలుతాయి. ఇవన్నీ కూడా సాధ్యమయ్యే పనులే. అసాధ్యం అనుకున్న పనులేవీ రేవంత్ ముందు లేవు. ఇకపోతే సమర్థనేతగా ఎదగడానికి కూడా ఇవి దోహదపడతాయి.
‘ప్రజాతంత్ర’ డెస్క్





