పదేళ్లుగా తెలంగాణను దోచుకున్న కెసిఆర్‌

ఇప్పుడు కాంగ్రెస్‌ వంతు వచ్చింది
మరోమారు గెలుపు బిజెపిదే
ఎన్నికల ప్రకటనకు ముందే
ఫలితం తేలిపోయింది
అత్యధిక సీట్లతో బిజెపిని బలపర్చండి
ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి చూపాం
నాగర్‌కర్నూలు సభలో ప్రధాని మోదీ

నాగర్‌కర్నూల్‌,ప్రజాతంత్ర,మార్చి16: కేంద్రంలో వరుసగా మూడోసారి బిజెపి గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే బిజెపి గెలుపు ఖాయమైందని అన్నారు. దేశంలో మరోమారు మోడీని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. నాగర్‌కర్నూల్‌లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. నాగర్‌కర్నూల్‌ లో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. భారాస పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారని చెప్పారు. పదేళ్లుగా తెలంగాణ ప్రజల కలలను భారాస, కాంగ్రెస్‌ చిదిమేశాయన్నారు.  ఇన్నేళ్లు భారాస అవినీతికి పాల్పడితే ఇప్పుడు తమ వంతు వచ్చిందని కాంగ్రెస్‌ భావిస్తోంది. భారాస, కాంగ్రెస్‌ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయిందన్నారు.

రాష్టాన్న్రి నాశనం చేసేందుకు కాంగ్రెస్‌కు ఈ ఐదేళ్లు చాలని ప్రధాని దుయ్యబట్టారు. భాజపాను గెలిపించండి.. విూ ఆకాంక్షలను నేరవేరుస్తాం. విూ అభివృద్ధి కోసం నేను రాత్రి, పగలూ పనిచేస్తాను. నిన్న మల్కాజిగిరిలో ప్రజలు వీధుల్లో బారులు తీరి మద్దతు తెలిపారు. మా పార్టీ ఎంపీలను భారీ సంఖ్యలో గెలిపిస్తే అప్పుడు కాంగ్రెస్‌ ఆటలు సాగవన్నారు. కాంగ్రెస్‌ ఆ పార్టీ ’గరీబీ హఠావో’ అని దశాబ్దాల క్రితమే నినాదం ఇచ్చింది. కానీ పేదరికం పోయిందా? కాంగ్రెస్‌ పాలన అంతా మోసం, దోపిడీ మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగానే చూసింది. భాజపాకు పూర్తి మెజారిటీ ఇచ్చిన తర్వాతే దేశంలో మార్పు మొదలైందిని మోడీ గుర్తు చేశారు. . మార్పునకు గ్యారంటీ.. మోదీ గ్యారంటీ మాత్రమే. నేను నా కోసం.. ఒక్కరోజు కూడా వినియోగించుకోలేదు. రేయింబవళ్లు 140 కోట్ల ప్రజల కోసమే పని చేస్తున్నాను. ఆర్టికల్‌ 370, అయోధ్య రామాలయం నిర్మాణం ఇందుకు కొన్ని ఉదాహరణలు అని మోదీ తెలిపారు.

image.png

తెలంగాణలో ప్రజల కోసం కోటి బ్యాంకు ఖాతాలు తెరిచాం. కోటిన్నర మందికి బీమా కల్పించాం. 67 లక్షల మందికి ముద్రా రుణాలు అందించాం. 80 లక్షల మంది ఆయుష్మాన్‌ పథకం కింద లబ్ది పొందారు. భాజపా పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, రైతులకే ఎక్కువ మేలు జరిగిందని మోడీ గుర్తు చేశారు.  కాంగ్రెస్‌ సామాజిక న్యాయం పేరుతో రాజకీయంగా పబ్బం గడుపుతోంది. గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిరచేందుకు ఆ పార్టీ ప్రయత్నించింది. యాదాద్రిలో చిన్నపీట వేసి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా అవమానించింది. దళిత బంధు పేరిట కేసీఆర్‌ మోసం చేశారు. దళితుడినే తెలంగాణకు తొలి సీఎం చేస్తామని మాట తప్పారు. కొత్త రాజ్యాంగం అవసరమంటూ అంబేడ్కర్‌ను అవమానించారు అని మోదీ విమర్శించారు. తెలంగాణను మన దేశంలో ’గేట్‌వే ఆఫ్‌ సౌత్‌’గా పిలుస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

కానీ అలాంటి రాష్టాన్న్రి దశాబ్దాలుగా అబద్దాలు, దోపిడీల పేరుతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు దోచుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ తెలంగాణను ఎప్పటికీ అభివృద్ధి చేయలేదని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన నినాదాన్ని కాంగ్రెస్‌ దశాబ్దాలుగా ఇచ్చింది కానీ పేదల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంది కానీ, ఈ ప్రజల పరిస్థితులు బాగుపడ్డాయా అని అడిగారు. మోదీకి పూర్తి మెజారిటీ ఇచ్చి సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడే దేశంలో మార్పు వచ్చిందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. బీజేపీ మెజారిటీ సీట్లు గెలిస్తే కాంగ్రెస్‌ కు వణుకువస్తుందని విమర్శించారు. రెండు పార్టీలు తెలంగాణను ధ్వంసం చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ ఒకటే అని కాంగ్రెస్‌ పార్టీ 2జీ స్కాం చేస్తే పాల్పడితే బీఆర్‌ఎస్‌ ఇరిగేషన్‌, భూ దందాలు చేసిందన్నారు. తెలంగాణలోను కమలం వికసించాలని మోదీ కోరారు. 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. తమ పార్టీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో డికె అరుణ, కిషన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *