నేడు అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్‌

ప్రవేశపెట్టనున్న రాష్ట్ర డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి భట్టి…
కౌన్సిల్‌లో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : నేడు రాష్ట్ర మధ్యంతర బడ్జెట్‌ను అసెంబ్లీలో డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బ్జడెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు కేబినెట్‌ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ శుక్రవారం ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్‌ సభను వాయిదా వేస్తూ..శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు. ఇక మండలిలో శ్రీధర్‌ బాబు బడ్జెట్‌ ప్రవేశ పెడతారు. అంతుకు ముందు శుక్రవారం సభలో కృష్ణాజలాలపై వాడీవేడీ చర్చ జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *