కాంగ్రెస్, బిజెపిలకు బుద్ది చెప్పడం ఖాయం:మంత్రి వేముల ప్రశాంతరెడ్డి
నిజామాబాద్,సెప్టెంబర్12:సీ
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ వెంట ప్రజలు నిలువాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు కళ్లముందు కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం అవుతుందని నాటి పాలకులు చెప్పారని గుర్తు చేశారు. వ్యవసాయానికి ఉచితంగా 24గంటలపాటు విద్యుత్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. వస్తే కాంగ్రెసోళ్లు 3గంటల కరెంటు ఇస్తరంటా, బీజేపీ వాళ్లు మోటర్లకు టర్లు బిగిస్తామంటున్నారని తెలిపారు. మోటర్లకు టర్లు పెడితే తెలంగాణకు రూ.25వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పినా సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా రైతులకు ఉచిత కరెంట్ అందిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ 60ఏండ్లు పరిపాలించినప్పటికీ నేటి ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపుతోందన్నారు.
సీఎం కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్టాల్ల్రో లేవని మంత్రి అన్నారు. 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ చేయలేని అభివృద్ధి ఇప్పుడు ఎట్ల చేస్తదో ప్రజలు ప్రశ్నించాలన్నారు. ఆసరా పింఛన్లతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ తదితర పథకాలను సీఎం కేసీఆర్ వచ్చాకే అమలమయ్యాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు.



