టిఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే అభివృద్ధి సాధ్యం

  • బిజెపి ఎంపిలు నలురుగు రాజీనామా చేస్తే మరింత అభివృద్ధి
  • ఎనిమిదేళ్లలో ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు
  • కాంగ్రెస్‌ ‌గెలిస్తేనే ప్రజాస్వామ్యం నిలుస్తుందన్న పిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి
  • పొర్లగడ్డ తండాలో..మన మునుగోడు-మన కాంగ్రెస్‌

‌యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి దళితులు, గిరిజనుల పూర్తి మద్దతు ఉందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. సంస్థాన్‌ ‌నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో మన మునుగోడు-మన కాంగ్రెస్‌ ‌కార్యక్రమాన్ని ఆయన పార్టీ జెండా ఎగరేసి లాంఛనంగా ప్రారంభించారు. అయితే జెండా రివర్సులో ఉండటంతో దాన్ని సరిచేసి మళ్లీ ఎగరేశారు. రాజీవ్‌ ‌గాంధీ జయంతి సందర్భంగా మునుగోడులోని 175 గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టుల వల్లే మునుగోడు అభివృద్ధి జరిగిందని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌, ‌బీజేపీలు కలిసి కాంగ్రెస్‌ ‌పార్టీని చంపే కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం గిరిజనులు కాంగ్రెస్‌ ‌పార్టీకి అండగా నిలవాలని కోరారు. మునుగోడులో కమ్యూనిస్టులు పేదల పక్షాన పోరాడారన్న రేవంత్‌ ‌రెడ్డి..అక్కడ జరిగే యుద్ధంలో కమ్యూనిస్టు, కోదండరామ్‌ ‌పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని అభ్యర్థించారు. ఉప ఎన్నికలతోనే అభివృద్ధి జరుగుతుందంటే..తక్షణమే నలుగురు బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ ‌పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. నలుగురు బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే 28 నియోజకవర్గాలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌కు వోటేసి టీఆర్‌ఎస్‌, ‌బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు.

బీజేపీకి ఆదర్శ పురుషోత్తముడు కల్వకుంట్ల చంద్రశేఖరుడు అని ఎద్దేవా చేశారు. కెసీఆర్‌.. ‌తెలంగాణను ఒక విష ప్రయోగశాలగా మార్చారని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌తోడు దొంగలుగా మారారన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు రూ.40 లక్షలు, 50 లక్షలకు అమ్ముడు పోతున్నారన్నారు. అమ్ముడుపోయిన వాళ్లంతా అభివృద్ధి అని అంటున్నారన్నారు. ప్రజాస్వామ్యం గెలవాలంటే కాంగ్రెస్‌ ‌గెలవాలన్నారు. తెలంగాణ ప్రజలంతా ఇవాళ మునుగోడు వైపు చూస్తున్నారని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఇది ఒక ప్రత్యేక సందర్భమని అని..ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడినా పాలకుల నిర్లక్ష్యం వల్ల నల్గొండలో ఫ్లోరైడ్‌ ‌సమస్య తీరలేదన్నారు. 8 ఏళ్లైనా కేసీఆర్‌ ‌ఫ్లోరైడ్‌ ‌సమస్యకు పరిష్కారం చూపించలేదన్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో హావి•లిచ్చినా నెరవేర్చలేదన్నారు. డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇళ్లు.. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, రైతుకు లక్ష రుణమాఫీ వంటి హావి•లు నెరవేర్చలేదన్నారు. డిండీకి నిధులిస్తే ప్రతీ గ్రామానికి నీళ్ళు వొస్తాయన్నారు. మునుగోడులో అత్యధికంగా ఉన్న నిరుద్యోగ సమస్యకు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదన్నారు. ఈ ప్రాంతంలో దొరికేది ఏంటంటే ఛీప్‌ ‌లిక్కర్‌ అని…ప్రజలకు కేసీఆర్‌ ఇచ్చిన బహుమానం ఛీప్‌ ‌లిక్కర్‌ అని అన్నారు. మునుగోడును చీఫ్‌ ‌లిక్కర్‌ అడ్డగా మార్చారన్నారు.

ఎనిమిదేళ్లలో ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు
సీఎం కేసీఆర్‌ ‌చేస్తున్న తప్పులే రాష్ట్రంలో బీజేపీ చేస్తుందని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్‌లో వి•డియాతో మాట్లాడుతూ…ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని తెలిపారు. కేసీఆర్‌ ‌సిగ్గులేకుండా వోట్ల కోసం మునుగోడుకు వొస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడమనే విషప్రయోగం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలలో గెలిచిన వారిని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను కేసీఆర్‌ అణచివేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రేవంత్‌ ‌రెడ్డి ప్రజలను కోరారు. రాజీనామా చేస్తే నిధులొస్తాయంటున్న భాజపా…వారి ఎంపీలను ఎందుకు రాజీనామా చేయించట్లేదని రేవంత్‌ ‌ప్రశ్నించారు. రాజీవ్‌ ‌గాంధీ జయంతి సందర్భంగా… నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఇంటింటికి తిరుగుతూ పండ్లు పంపిణీ చేశారు. అనంతరం చౌటుప్పల్‌లో వివిధ పార్టీల నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజీనామాతో ఏ గ్రామాలకు నిధులు వొచ్చాయో చెప్పాలని ఆయన ధ్వజమెత్తారు. అమ్ముడుపోయిన వాళ్లంతా సిద్దాంతాలు చెప్పడం దారుణమని మండిపడ్డారు. డిండి ప్రాజెక్టు పూర్తిచేయకపోవడం వల్ల మునుగోడుకు అన్యాయం జరిగిందని రేవంత్‌ ‌పేర్కొన్నారు. రాజీనామాల ద్వారానే నిధులు వొస్తాయని భాజపా చెప్తుంది. అలాంటప్పుడు భాజపా ఎంపీలను రాజీనామా చేయించి నిధులు తీసుకురండి. రాజీనామాతో ఏ గ్రామాలకు నిధులు వొచ్చాయో చెప్పండి. అమ్ముడుపోయిన వాళ్లంతా సిద్దాంతాలు చెప్పడం దారుణం. భాజపా, తెరాస ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు. ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండి. యువత చైతన్యంతో కొనుగోలు రాజకీయాలను పాతరేయాలి. ప్రతీ గ్రామంలో ఇంటి ఇంటికి కాంగ్రెస్‌ ‌స్టిక్కర్లు అంటించాలి. మునుగోడులో మద్దతు ఇవ్వాలని కోదండరామ్‌ను కలిశా. ఈ నియోజకవర్గంలోని రైతులకు రూ.300 కోట్ల రుణమాఫీ జరగాలి. పెండింగ్‌లో ఉన్న పోడుభూముల సమస్య పరిష్కరించండి. పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని రేవంత్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *