‘‘గులాబీ గుండెల్లో గుబులు’’

‘ఉద్యమ సమయంలో దేవుడిలాగా కనిపించిన కేసీఆర్‌ ఇప్పుడు మరోలా కనపడుతున్నారని తనకు తన తండ్రి సింగరేణి వారసత్వ ఉద్యోగం వస్తుందని ఆశపడితే 5 ఎకరాల భూమిని అమ్ముకోవాల్సి వచ్చిందని, ఉద్యోగం రాలేదు దాంతో ఎవరు పిల్లను కూడా ఇస్తలేరని హుజురాబాద్‌ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న చల్లా తిరుపతిరెడ్డి కన్నీళ్లపర్యంతమవుతూ, తన ఎదపై పొడిపించుకున్న కేసీఆర్‌ అనే పచ్చబొట్టును చూపిస్తూ ఎన్నికల అనంతరం ఆ పచ్చబొట్టును చెరిపివేయడానికి ప్రయత్నాలు చేయాలని  చెప్పాడు…’’
తన అనుభవమంత వయసు కూడా లేని కేటీఆర్‌ సుప్రసిద్ధ చలనచిత్ర దర్శకుడు, ప్రజాయుద్ధనౌక గద్దర్‌కు గురువు బి. నర్సింగరావుకు కనీస అపాయింట్మెంట్‌ కూడా ఇవ్వకపోతే నీ అధికారం..నీ లక్షల కోట్ల ఆస్తి నా కాలిగోటికి సమానమని ట్విట్టర్‌ వేదికగా ఆయన వాపోయారు.
image.png
ప్రగతి భవన్‌ గేటు ముందు గద్దర్‌ మూడు గంటల పాటు ఎండలో పడిగాపులు కాసినా, కలువని నాజీల మించిన నియంత పాలకులు నేడు వోటర్‌ మహాశయుల ముందు మోకరిల్లి వేడుకుంటున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
image.png
బిఆర్‌ఎస్‌ ది అవినీతి పాలన అంటూ బహిరంగ సభల్లో చెప్పే బిజెపి అగ్రనాయకత్వం, ప్రధాని మోదీ  మొదలు, అమిత్‌ షా వరకు  ఇప్పటివరకు వారిపై ఒక్క చర్యకు కూడా పూనుకోకపోవడం లోని ఔచిత్యమేమిటో ఎవరికి బోధపడదు. తన ప్రత్యర్థులు, భాగస్వామ్య ప్రత్యర్ధుల ఇండ్లపై వ్యాపార సంస్థలపై ఇడి, ఐడి దాడులు చేపించే బిజెపి ప్రభుత్వానికి లిక్కర్‌ కేసులో ఉన్న కవితను అరెస్ట్‌ చేయకపోవడంలోని ఆంతర్యం వారి చీకటి బంధంలో భాగమేనని బిజెపిని వీడి బయటికి వస్తున్న నాయకులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
 
 
image.png
ప్రముఖ ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, సర్వే సంస్థలు ఈ సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని డోలయాన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతు మీన వేషాలు లెక్కబెడుతున్న వేళ ‘‘ప్రజాతంత్ర’’ తెలంగాణ దినపత్రిక లో మూడు నెలల క్రితం నా వ్యాసం ప్రచురితం అయ్యింది. ముందే కుండబద్దలు కొట్టినట్టుగా రాష్ట్రంలో అనూహ్య మార్పులు రాబోతున్నాయని తేల్చి చెప్పిన…!  సీఎం  కేసీఆర్‌ కొడుకు, బిడ్డ, అల్లుడు, సడ్డకుని కొడుకు, దుష్ట చతుష్టయంగా ఏర్పడి రాజులను మించిన పాలన ఫలితమే ఆ పార్టీ పతనానికి కారణం. తల పొగురుతో, అహంకారపూరితంగా మాట్లాడే కేటీఆర్‌ పొగరు, అహంకారం, అహంభావం తగ్గించుకొని ఇంకొక్కసారి అవకాశం ఇవ్వండి అని ప్రాధాయపడుతున్న విధానం ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’’ అన్న చందంగా కనిపిస్తున్నది. తన అనుభవమంత వయసు కూడా లేని కేటీఆర్‌ సుప్రసిద్ధ చలనచిత్ర దర్శకుడు, ప్రజాయుద్ధనౌక గద్దర్‌ కు గురువు బి. నర్సింగరావుకు కనీస అపాయింట్మెంట్‌ కూడా ఇవ్వకపోతే నీ అధికారం.. నీ లక్షల కోట్ల ఆస్తి నా కాలిగోటికి సమానమని ట్విట్టర్‌ వేదికగా ఆయన వాపోయారు.
ప్రగతి భవన్‌ గేటు ముందు గద్దర్‌ మూడు గంటల పాటు ఎండలో పడిగాపులు కాసినా, కలువని నాజీల మించిన నియంత పాలకులు నేడు వోటర్‌ మహాశయుల ముందు మోకరిల్లి వేడుకుంటున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఆత్మగౌరవం, ప్రజాస్వామిక తెలంగాణ కోసం కదం తొక్కి రెండున్నర దశాబ్దాల మలిదశ ఉద్యమ ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో తొమ్మిదిన్నర ఏండ్ల గులాబీల పాలన పట్ల ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే రాచరిక, ఫ్యూడల్‌ పాలన విధానాలను పసిగట్టిన మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదిన ఉస్మానియా విద్యార్థులు క్యాంపస్‌ ఆవరణలో హెలికాప్టర్‌ లో వచ్చి లాండ్‌ అయ్యే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు నిరసనగా హెలిపాడ్‌ చుట్టూ చేరి చెప్పులు చూపించి, చుక్కలు చూపించారు. దాన్ని మనసులో పెట్టుకున్న ఏలిక, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తూ దాని మనుగడనే ప్రశ్నార్ధకం చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుండి వర్సిటీకి రావలసిన వందలాది కోట్ల రూపాయల బ్లాక్‌ గ్రాంట్‌ నిధులను విడుదల చేయడం లేదు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలకు హాజరు కావడానికి వెనుకంజ వేసి, చివరికి వేలాది మంది పోలీసుల పహారాలో వెళ్లి పట్టుమని పది నిమిషాలు కూడా మాట్లాడకుండా వెనుదిరగాల్సి వచ్చింది.
నిరుద్యోగ యువతీ ప్రవళిక ఆత్మహత్యను వక్రీకరించడానికి పూనుకొని భంగపడ్డ షాడో సీఎం కేటీఆర్‌ ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీ, చిక్కడపల్లి సెంట్రల్‌ లైబ్రరీ, అశోక్‌ నగర్‌ వీధుల్లో నిరుద్యోగ సమస్యలతో సతమతమవుతున్న 30 లక్షల మంది నిరుద్యోగ యువత గురించి ఏ ఒక్కనాడు పట్టించుకోకుండా, ప్రభుత్వం చేయాల్సిన పనులను తను చేస్తూ నిరుద్యోగ యువతకు చేదోడు వాదోడుగా ఉంటున్న అశోక్‌ సార్‌ పై కేసులు పెట్టి  జైలు పాలు చేశారు. తన పార్టీ ఎజెండాలోనే లేని నిరుద్యోగ సమస్య గురించి ఇప్పుడు కేటీఆర్‌ టి- హబ్‌ మెట్లపై కూర్చుని నిరుద్యోగుల ముసుగులో ఉన్న  పెయిడ్‌ ఆర్టిస్టులతో బోగస్‌ చర్చలు చేస్తూ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడానికి డిసెంబర్‌ 4న చీఫ్‌ సెక్రటరీని వెంటపెట్టుకొని అశోక్‌ నగర్‌ వచ్చి జాబ్‌ క్యాలెండర్ను ప్రకటిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉన్నది. మెట్రో రైల్లో తిరగడం, డెలివరీ బాయ్స్‌ తో సమావేశాలు చూస్తుంటే ఒక ‘‘మాయలఫకీర్‌’’ లా తన వ్యవహారం కనిపిస్తున్నది.
‘‘దింపుడు కళ్ళం’’ ఆశలో ఉన్న బిఆర్‌ఎస్‌ నేతలకు అది  నుంచి అన్నీ ఆటంకాలె ఎదురవుతున్నాయి. బిఆర్‌ఎస్‌ ది అవినీతి పాలన అంటూ బహిరంగ సభల్లో చెప్పే బిజెపి అగ్రనాయకత్వం, ప్రధాని మోదీ  మొదలు, అమిత్‌ షా వరకు  ఇప్పటివరకు వారిపై ఒక్క చర్యకు కూడా పూనుకోకపోవడం లోని ఔచిత్యమేమిటో ఎవరికి బోధపడదు. తన ప్రత్యర్థులు, భాగస్వామ్య ప్రత్యర్ధుల ఇండ్లపై వ్యాపార సంస్థలపై ఇడి, ఐడి దాడులు చేపించే బిజెపి ప్రభుత్వానికి లిక్కర్‌ కేసులో ఉన్న కవితను అరెస్ట్‌ చేయకపోవడంలోని ఆంతర్యం వారి చీకటి బంధంలో భాగమేనని బిజెపిని వీడి బయటికి వస్తున్న నాయకులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసిన ‘‘బీసీ’’ నాయకుడు బండి సంజయ్‌ ని అకారణంగా తొలగించి, పార్టీ గ్రాఫ్‌ పడిపోవడానికి కారణమైన హై కామాండ్‌ ఇప్పుడు ‘‘బీసీ’’ ని ముఖ్యమంత్రిని చేస్తామంటే నమ్మశక్యంగా లేదు.
అధికారంలో ఉన్నది రెండు సార్లే అయినా ఇంత ప్రజాగ్రహానికి గురైన పార్టీ మనకు దేశంలో ఎక్కడా కనిపించదు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఆహారాహం కృషిచేసిన సకల జనులు,ఇప్పుడు  దగాపడ్డామని భావిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో జరగనంత వనరుల విధ్వంసం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత జరగడాన్ని  చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  గృహ నిర్మాణ శాఖను ఎత్తివేయడం, రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేసి ‘‘ధరణి’’ తెచ్చి వేలాది ఏకరాల భూమిని దొరలపాలు చేయడం తన సామాజిక వర్గం వారు ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడిన ‘‘బారాఖూన్‌ మాఫ్‌’’ అన్న రీతిలో యంత్రాంగానికి సంకేతాలు ఇవ్వడం వలన ఒక పురపాలక సంఘంలో ఫిట్టర్‌ నిధులు నిర్వర్తించే ఒక ఉద్యోగి 2018లో లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడి సస్పెండ్‌ అయి ఎలాంటి విచారణ లేకుండానే రెండు నెలలు తిరగక ముందే సస్పెన్షన్‌  ఎత్తివే యుంచుకొని విధుల్లో చేరడం బట్టి, పాలన ఎంతగా భ్రష్టు పట్టిపోయిందో చెప్పవచ్చు. ప్రజాసంక్షేమాన్ని,పరిపాలనను గాలికి వదిలేసిన  బిఆర్‌ఎస్‌ పాలకులు, సర్పంచులు మొదలు, ఎంపీటీసీలు, మండల నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు యధేచ్చగా వనరుల దోపిడీకి పాల్పడుతూ నిరంకుశంగా, ప్రశ్నించే  గొంతులను నొక్కివేసి మాఫియా ముఠాలుగా తయారైన బిఆర్‌ఎస్‌ నాయకులు పందికొక్కులుగా కనిపిస్తున్నారని విశ్రాంత ప్రొఫెసర్‌ కూరపాటి వెంకటనారాయణ వాపోయారు.
ఉద్యమ సమయంలో దేవుడిలాగా కనిపించిన కేసీఆర్‌ ఇప్పుడు మరోలా కనపడుతున్నారని తనకు తన తండ్రి సింగరేణి వారసత్వ ఉద్యోగం వస్తుందని ఆశపడితే 5 ఎకరాల భూమిని అమ్ముకోవాల్సి వచ్చిందని, ఉద్యోగం రాలేదు దాంతో ఎవరు పిల్లను కూడా ఇస్తలేరని హుజురాబాద్‌ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న చల్లా తిరుపతిరెడ్డి కన్నీళ్ల పర్యంతమవుతూ, తన ఎదపై పొడిపించుకున్న కేసీఆర్‌ అనే పచ్చబొట్టును చూపిస్తూ ఎన్నికల అనంతరం ఆ పచ్చబొట్టును చెరిపివేయడానికి ప్రయత్నాలు చేయాలని  చెప్పాడు. ప్రజలను డు..డు బసవన్నలను చేసి గొర్లు, బర్లు ఇచ్చి అదే అభివృద్ధి నమూనా అని చెప్పిన దానికి చెంపపెట్టు లాగా చదువులు చదివితే డిగ్రీ పట్టాలు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు రావడం లేదని సోషల్‌ మీడియా వేదికగా వాపోయిన బర్రెలక్కపై కక్ష కట్టి కేసులపాలు చేసిన దానికి ప్రతిఫలంగానే ఆ యువతి కొల్లాపూర్‌ అసెంబ్లీ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండి పాలకులకు  ముచ్చెమటలు పట్టిస్తున్నది.
ప్రభుత్వ వ్యతిరేకత గురించి చెప్పుకుంటూ పోతే లెక్కేలేదు.కర్ణుడి చావుకునన్ని కారణాలు ఇప్పుడు బిఆర్‌ఎస్‌ పతనానికి ఉన్నాయి.  నయా జోష్‌ లో పోతున్నది కానీ, ఇప్పటికింకా కాంగ్రెస్‌ తన ప్రజా కర్షక ఎన్నికల మేనిఫెస్టో గురించి చేయాల్సినంత ప్రచారం చేయలేదనే చెప్పాలి. శ్రీధర్‌ బాబు కన్వీనర్‌ గా  ఉన్న కమిటీ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించింది. విద్యార్థి, మేధావి, కార్మిక, కర్షక ప్రజాసంఘాలు, మధ్యతరగతి బుద్ధి జీవులు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం పథకాల రూపకల్పనలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు కాంగ్రెస్‌ కు సానుభూతి పవనాలు రోజు రోజుకు పెరిగిపోవడం ఈ పరిస్థితి పట్టణాల్లో కంటే పల్లెల్లో ఎక్కువ కనిపించడం గులాబీ శ్రేణులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీ చేసిన చెప్పుకోదగ్గ పని ఒకటి కూడా లేకపోగా సరిగ్గా ఎన్నికల మధ్యలో  ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న కాళేశ్వరం  ప్రాజెక్టు కుంగిపోయి, బుంగలు పడి గులాబీల పాలన నిజ స్వరూపాన్ని ప్రజల ముందు బట్ట బయలు చేసింది. డిపిఆర్‌, సరైన ప్లానింగ్‌ లేకుండా, కమీషన్లకు కక్కుర్తిపడి, రీడిజైన్‌  చేసి, రికార్డుల కోసం హడావిడిగా పనులు చేసి ప్రజల సొమ్ము లక్ష కోట్ల రూపాయలను గోదారి పాలు చేశారు.
ఎప్పుడూ ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేసే కేసిఆర్‌ ఇప్పుడు తానే ఆత్మరక్షణలో పడిపోయి  స్వరం తగ్గించి చేసిన ఎన్నికల ప్రచారాన్ని గమనించిన రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యపోయారు. భారత్‌ జోడో యాత్ర నుండి ఊపు మీద ఉన్న రాహుల్‌ గాంధీ, ఇందిరాగాంధీని మరిపిస్తున్న ప్రియాంక గాంధీ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సభలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి కేంద్రంగా హరీష్‌ రావు పై తీవ్ర విమర్శలు చేసిన అనంతరం కూడా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వడం, దాన్ని ఆయన గడ్డి పోచలాగా తిరస్కరించి కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చింది, అంతకంటే ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు మొదలు, అనేక మంది బడా నాయకులు బిఆర్‌ఎస్‌-బిజెపిల నుండి కాంగ్రెస్‌ లో చేరడం ఆ పార్టీ బలాన్ని పెంచింది టిఆర్‌ఎస్‌ అధినేత పోటీ చేస్తున్న రెండు చోట్ల ప్రతికూల పవనాలే వీస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. గట్టెక్కిస్తుందనుకున్న రైతుబంధును హరీష్‌ రావు కారణంగా ఇ.సి నిలిపివేయడంతో మరింత డీల పడిపోయారు.   ‘‘బలగం ఫేమ్‌’’ తో ప్రచార ప్రకటనలు మొదలు ‘‘గులాబీల జెండాలే రామక్క’’ అంటే ‘‘గులాబీల దొంగలే రామక్క’’ అని కాంగ్రెస్‌ పార్టీ ప్రతి దానిని సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఊహించని ఈ పరిణామాలన్నింటిని చూసి బిఆర్‌ఎస్‌ నాయకులు బెంబేలెత్తిపోతున్నారు.
 -పబ్బు శ్రీనివాస్‌
సీనియర్‌ జర్నలిస్టు,
9441331288

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *