కుటుంబాల భవిష్యత్తును ఆలోచించి వేయాలి
రైతాంగానికి అన్ని సదుపాయాలు కల్పించాం
కాంగ్రెస్ ధరణిని తీసేసి 3 గంటల కరెంటే ఇస్తారట
పోరాటాల పురిట గడ్డ పాలకుర్తి..ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన, మంచి పేరున్న ఎర్రబెల్లిని గెలిపించాలి
తోర్రూరు ప్రజా అశిర్వాద సభలో సీఎం కేసీర్
పాలకుర్తి, ప్రజాతంత్ర, నవబంర్ 14 : స్వాతంత్య్రం వొచ్చిన 75 ఏళ్లలో ప్రజాస్వామ్య ప్రక్రీయలో ప్రజలకు రావల్సిన హక్కులను గత ప్రభుత్వాలు కల్పించలేక పోయాయని, ప్రజలు అశించిన స్థాయిలో అభివృద్ధి ఫలాలు గత ప్రభుత్వాలు అందించలేకపోయాయని, అందుకే ప్రాణ త్యాగం చేసి తెలంగాణను సాధించు కున్నామని, ఇప్పుడుడిప్పుడే తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకుం టున్నామని, అందుకు ప్రజలు విచక్షణతో అలోచించి గత ప్రభుత్వాలు, పార్టీలు ఏమి చేశాయి..ఇప్పుడు బారాసా ఏమి చేసిందో అలోచించి వోటు వేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల కేంద్రంలో పాలకుర్తి నియోజకవర్గ బారాసా అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షుతన జరిగిన ప్రజా అశీర్వాద సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగమం కావద్దని, తమ చేతులో ఉన్న వజ్రాయుదమైన వోటును సమర్థులైన పాలకులను ఎన్నుకునేందుకు ఉపయోగించాలని కోరారు. కాంగ్రెస్‌ను 50 ఏళ్లు ప్రజలు వోటు వేసి గెలిపిస్తే అవినితి అక్రమాలు తప్ప చేసింది శూన్యమన్నారు. మల్లి వొచ్చి ఒక్క చాన్సు అంటూ ప్రజలను మోసం చేయాలని చూస్తుందని విమరి్శ ంచారు. దేవాదుల, ఎస్సారేస్సీ కాలువల్లో గడ్డి మోలిచింది తప్ప నీరు పారలేదని ఏద్దేవా చేశారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకొని కాలేశ్వరం కట్టి ప్రతి ఎకరానికి సాగు నీరు తెచ్చుకున్నా మన్నారు. ప్రభుత్వానికి ఉండాల్సిన భూమి హక్కులను ప్రజలకు కల్పించి తన వేలి ముద్రతోనే తనభూమిని చూసుకేనేలా దరణిని తీసుకవచ్చి రైతుబంధు, రైతు బీమా ఇస్తుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాకాతంలో కల్పివేస్తామంటే ఉరుకుందామా అంటూ కెసిఆర్ ప్రశ్నించారు. ధరణిని తీసివేసి 3గంటల కరెంటు ఇస్తానని చెబుతున్న కాంగ్రెస్‌కు తగిన గుణపాటం చేప్పాలని సూచించారు.
కష్టపడి రైతులకు 24గంటల కరెంటు ఇచ్చి, కావల్సీ సదుపాయాలు కల్పిస్తే కాంగ్రెస్ వారు ఆధికారంలోకి రాగానే అన్ని తీసివేసామని బహిరంగగానే ప్రకటిస్తుంటే ఉరుకుందామా..అన్నారు. స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత•రెడ్డి 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకుంటే 3 గంటలే చాలంటున్నారని, ఆ మోటార్లు ఎవ్వరు కోనియ్యాలో ప్రజలు అలోచించాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలు పదేళ్ల క్రీతం వలసలు వేల్లేవారని, కాని ఇప్పుడు సాగునీరు సమ్రుద్ధిగా రావడంతో వలసలు పూర్తిగా తగ్గిపోయాయని గుర్తు చేశారు. పదేళ్లలో రాష్ట్రంలో ఎంత మార్పు వొచ్చిందో ప్రజలు గుర్తించాలన్నారు. ఇన్నేళ్ల్లు కాంగ్రెస్ పాలనలో దళితులను వోటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నారని, కాని తాము వారి అభ్యన్నతి కోసం దళిత బంధును తీసుకవొచ్చినమన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గిరిజనులకు తమ పానలను తమకే ఇచ్చామన్నారు. మిషన్ భగిరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించామన్నారు. గ్రామాలలో సీసీరోడ్లు, మురికి కాలువలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు నిర్మించి ఎంతగానే అభివృద్ధి చేశామన్నారు. పోరాటాలకు పురిటిగడ్డ పాలకుర్తి అని, ఇక్కడి ప్రజలు చైతన్యవం తమైనరని, అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. రైతుబంధు దుబారా అనే కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పి పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావును గెలిపిస్తే రైతు బంధు 16వేలు చేస్తామని చెప్పారు. దయాకర్ రావుకు రాష్ట్రంలోనే మంచి పేరుందన్నారు. అఢివృద్ధికి మారుపేరు ఎర్రబెల్లి అన్నారు.
ఆయ నను తామ ంతా చెక్‌డ్యాం రావు అని పిలుచుకుం టమన్నారు. గతంలో వర్దన్నపేటలో, ఇప్పుడు పాలకుర్తిలో వాగులపై చెక్‌డ్యాంలను నిర్మించి ఈప్రాంత రైతంగానికి కరువు లేకుండా చేసి గొప్ప నేతగా ఎర్రబెల్లిని అభివర్నించారు. పంచాయతిరాజ్, ఉపాధి హామి, మిషన్ భగీరథ మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి సమర్దవంతంగా పని చేసి గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసి ఎన్నో ఆవార్డు సాధించారని కోనియాడారు. కాంగ్రెస్ చెప్పే మాయమాటలు ప్రజలు నమ్మవద్దన్నారు. వోట్లు రాగానే అమెరికా నుంచి విమానంలో వొచ్చి ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి వోట్లు ముగిసిన వెంటనే తిరిగి విమానంలో పోయేవారి మాటలు నమ్మవద్దని సూచించారు. ఎప్పుడు ప్రజలకు అండగా నిలిచి అబివృద్ధి చేసేవారిని గెలిపించాల న్నారు. పాలకుర్తిలో ఇంజనీరింగ్ కళాశాల, గ్రామానికో 100 ఇళ్లు అభివృద్ధికి నిధులు మ్రతి ఎర్రబెల్లి అడిగారని, గెలిపింస్తే అధికారంలోకి వొచ్చిన నెలరోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలోచించి వోటు వేయాలని, అభివృద్ధికి పట్టం కట్టండని ప్రజలకు సిఎం కెసిఆర్ పదేపదే సూచించారు.





