– హాజరైన దేవాదాయ శాఖ మంత్రి సురేఖ
– తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తాం : పాలకమండలి
యాదాద్రి భువనగిరి, జూలై 11 (ప్రజాతంత్ర): ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి శనివారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ బంగారు వాకిలి వద్ద నూతన ఛైర్మన్, సభ్యులతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. యాదగిరిగుట్టను దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పాలకమం డలి సమిష్టిగా పనిచేయాలని సూచించారు. అనంతరం జరిగిన తొలి ట్రస్టు బోర్డు సమావేశంలో ఆలయ అభివృద్ధి, భక్తులకు వసతి, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల మెరుగుదలపై చర్చించారు. తిరుమల తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేయడంతో పాటు కొండపై వసతి గృహాలు, విష్ణు పుష్కరిణి, బస్సు సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని పాలక మండలి చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





