– ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్‌ను కోరిన సీఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : ఎమిరేట్స్ వైమానిక సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హాన్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎ-380 సర్వీసులను ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఎమిరేట్స్ విమాన సర్వీసులను మరిన్ని పెంచాలని సీఎం కోరారు. తెలంగాణలో మరో రెండు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఎమిరేట్స్ ఎమ్మార్వో ఆపరేషన్స్ కొనసాగించాలని, విమాన సర్వీసులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు స్పాన్సర్‌షిప్‌కు ముందుకు రావాలని కూడా సర్హాన్ ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





