మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలి

– అవగాహన కల్పిస్తున్న బీసీ సంక్షేమ శాఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మట్టి వినాయకుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మట్టి వినాయకుడిని అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, వినాయక చవితి సందర్భంగా రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులు పర్యావరణహితమైన మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని బీసీ సంక్షేమ శాఖ ప్రజలకు అవగాహన కల్పిస్తోందన్నారు. మట్టి వినాయకులను అందించడం పట్ల భట్టి విక్రమార్క మంత్రి పొన్నంకు, బీసీ సంక్షేమ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మట్టి వినాయకుల వినియోగం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతోపాటు సంప్రదాయ పద్ధతులను ప్రోత్సహించవచ్చని మంత్రి పొన్నం తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *