మహిళల భద్రత, గౌరవానికి ప్రాధాన్యం

– సంపద సృష్టించే శక్తిగా మహిళలకు ప్రోత్సాహం
– ‘సఖి నివాస్’ ప్రారంభించిన మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : మహిళల భద్రత, వారి గౌరవానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పంచాయతీ రాజ్, గ్రావిÖణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అని అన్నారు. బంజారాహిల్స్‌లో సఖి నివాస్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌ను ఆమె మంగళవారం ప్రారంభించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణ పరిమితి పెంచుతున్నట్లు మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళలను సంపద సృష్టించే శక్తిగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. మహిళల ఆదాయం పెరిగితే కుటుంబం బలపడుతుందన్నారు. జూన్ 5న మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ బస్సులు అందజేస్తారని, మహిళా సంఘాల సోలార్ ప్లాంట్లను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిరలో బుధవారం ప్రారంభిస్తారని తెలిపారు. వర్కింగ్ ఉమెన్స్ భద్రత తమ ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. గ్రావిÖణ మహిళలకు హైదరాబాద్‌లో సురక్షిత వసతి కల్పిస్తున్నామని చెప్పారు. సఖి నివాస్‌లో 150 మంది మహిళలకు వసతి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. చిన్న పిల్లలతో వచ్చే తల్లులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి మహిళల పురోగతితోనే ముడిపడి ఉందని నమ్మిన ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. మహిళలు కేవలం చిన్నచిన్న వ్యాపారాలకే పరిమితం కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారని గుర్తు చేశారు.  ఇందుకోసం మండలాల్లో రైస్ మిల్లులు, గోడౌన్లు, ప్లాస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం వంద ఎకరాల వరకు ప్రభుత్వ భూములను కేటాయించడానికి సిద్ధంగా ఉందన్నారు. కార్పొరేట్ మార్కెట్ రంగంలోకి మహిళలను తీసుకెళ్లేందుకు మహిళా శక్తి సూపర్ బాజార్లను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *