వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలి

– గవర్నర్‌ను కోరిన టీఆర్‌ఎస్ అధినేత కవిత

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరినట్లు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత తెలిపారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ను మంగళవారం కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వెలుగుమట్లతోపాటు వికారాబాద్ జిల్లా కడ్లాపూర్, ట్రిపుల్ ఆర్ బాధితులతో కలిసి గవర్నర్‌ను కలిశామని చెప్పారు. వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని కోరామన్నారు. కడ్లాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు జారీ చేసిన భూసేకరణ నోటీసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పు తదితర సమస్యలపై బాధితులతో కలిసి గవర్నర్‌కు వినతిపత్రం అందజేశామన్నారు. న్యాయం జరగకపోతే మళ్లీ పోరు బాట పడతామని కవిత హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *