వీగిన మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు

– 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు దక్కని ఆమోదం
– అనుకూలంగా 278.. వ్యతిరేకంగా 211 ఓట్లు
– రాజ్యాంగ సవరణకు అవసరమైన మద్దతు కరవు
– ఐక్యతను చాటుకున్న ఇండి కూటమి
– ప్రధాని మోదీ పిలుపు నిష్ఫ‌లం

న్యూదిల్లీ, ఏప్రిల్‌ 17: ‌మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. సుదర్ఘ చర్చ అనంతరం బిల్లుపై జరిగిన టింగ్‌లో మొడొంతుల మెజార్టీని సాధించలేకపోయింది.  ఈ బిల్లుతో  ముడిపడిన మూడు బిల్లులపై సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం సాయంత్రం టింగ్‌ ‌జరిగింది. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్‌, ‌కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై ఈ వోటింగ్‌ ‌జరిగింది. ఉత్కంఠ భరితంగా జరిగిన వోటింగ్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 278, వ్యతిరేకంగా 211 ట్లు పడ్డాయి. మొత్తం వోటింగ్‌లో 489 మంది పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్‌ అమలు సవరణ బిల్లు అవసరమైన మెజారిటీ సాధించలేకపోయింది. దీనిపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన వోటింగ్‌ ‌పక్రియలో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 మంది వోటు వేయగా, వ్యతిరేకంగా 230 మంది వోటేశారు. దీంతో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమైన 326 వోట్లను ఎన్డీఏ సాధించలేకపోయింది. దీంతో మిగతా రెండు బిల్లులను వెనక్కి తీసుకుంటు న్నట్లు కేంద్ర మంత్రి కిరణ్‌ ‌రిజిజు ప్రకటించారు. ప్రధాని మోదీ మనస్సాక్షిగా వోటేయాలని పిలుపునిచ్చినా విపక్ష కూటమి తన బలిమిని చాటింది. ఒక్కరు కూడా అనుకూలంగా కలసి రాలేదు. రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 540. అంటే బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 360 మంది మద్దతు కావాలి. అధికార ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల మద్దతు ఉంది. అందువల్ల మరో 68 మంది మద్దతు అవసరం. మరోవైపు విపక్షాల బలం 233. వీరు కాకుండా స్వతంత్రులు, తటస్థ పార్టీలకు చెందిన వారు కలిసి 15 మంది ఉన్నారు. ప్రతిపక్ష సభ్యులు ఎక్కువ మంది గైర్హాజరైతే బిల్లు గ్టటెక్కే అవకాశం ఉందని అధికార ఎన్డీఎ భావించింది.  సాయంత్రం 6 గంటలకు లోక్‌సభలో హోం మంత్రి అమిత్‌షా ప్రసంగించాక, ఈ బిల్లులపై ఓటింగ్‌ ‌జరిగింది. ఓటింగ్‌ ‌సమయంలో ప్రధాని మోడీ కూడా సభలోనే ఉన్నారు. ఓటింగ్‌ అనంతరం కిరణ్‌ ‌రిజిజు ప్రకటన చేశారు. దీంతో సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం‌బిర్ల ప్రకటించారు.

చరిత్రలో చిరస్థాయిగా నిలిచే రోజు : ముఖ్యమంత్రి రేవంత్‌ పోస్ట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే మరుపురాని రోజు అని ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స’లో పోస్టు పెట్టారు. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రజాస్వామ్య శక్తులు, ప్రతిపక్ష నాయకులు అంతా ఏకమై ఒక జాతీయ విపత్తును నివారించారన్నారు. నల్ల బిల్లులను ఓడించేందుకు కఠిన పరిస్థితుల్లోనూ ఐకమత్యంతో, సాహసంతో నిలిచిన మిత్రపక్షాల నాయకులు ఎం.కే.స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, లాలు ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్, ఫరూఖ్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, అలాగే కమ్యూనిస్ట్ పార్టీల నాయకులందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *