నైరుతి రుతుపవనాల తిరోగమనం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : నైరుతి రుతుపవనాల తిరోగన మరేఖ ఇప్పుడు 27.5°N/86.5°E, సుపాల్, రాంచీ, సుందర్‌గఢ్, బర్గఢ్, బిజాపూర్, హైదరాబాద్, బెళగావి, పంజిమ్, 15°N/72°E గుండా వెళుతోందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో ఈ తిరోగమన రేఖ తాండూర్, వికారాబాద్, హైదరాబాద్, జనగాం, భూపాలపల్లి గుండా వెళుతోంది. రాబోయే 3-4 రోజుల్లో తూర్పు భారతదేశం, ఉత్తర ద్వీపకల్పంలోని మరికొన్ని ప్రాంతాల నుండి, అలాగే ఈశాన్య భారత్‌లోని అనేక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు మరింతగా తిరోగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు గురువారం మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, గోవా, కర్ణాటక, తెలంగాణ, ఒడిశాలలోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలోని మరికొన్ని ప్రాంతాల నుండి మరింతగా ఉపసంహరించుకున్నాయి. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ రేఖ ప్రస్తుతం 27.5°N/86.5°E, సుపాల్, రాంచీ, సుందర్‌గఢ్, బర్గఢ్, బీజాపూర్, హైదరాబాద్, బెళగావి, పనాజీ, 115°N/72°E మీదుగా కొనసాగుతోంది. రేపు, ఎల్లుండి రాస్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరికలు లేవు.
—————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *